బాబు ఓకె అనలేదు.. ముహుర్తం ఎలా?

డిసెంబర్ 16న తిరుపతిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ అన్న గ్యాసిప్ గడచిన మూడు నాలుగు రోజులుగా చక్కర్లు కొడుతోంది. కానీ ఇది కరెక్టేనా అన్నది ఓ చిన్న అనుమానం. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్…

డిసెంబర్ 16న తిరుపతిలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ అన్న గ్యాసిప్ గడచిన మూడు నాలుగు రోజులుగా చక్కర్లు కొడుతోంది. కానీ ఇది కరెక్టేనా అన్నది ఓ చిన్న అనుమానం. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ అంటే చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు వుండాల్సిందే. అందులో అనుమానం లేదు.

కానీ చంద్రబాబు ఏ సంగతి వెంటనే ఓకె అనరు. ఆయన టైమ్, డేట్ ఇచ్చేవరకు ఆగాల్సిందే. గౌతమీపుత్ర శాతకర్ణికి కూడా జస్ట్ మూడురోజుల మందు ఓకె అన్నారు. బాబుగారు రావడంతో సంబంధం లేకుండా ఫంక్షన్ ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు.

మరి ఈసారి ఏం చేస్తారో తెలియదు. ఫంక్షన్ తిరుపతిలో అన్నది ఫైనల్ అయింది. డిసెంబర్ లో అన్నది కూడా ఫైనల్ అయింది. కానీ 16న వుంటుందా? అన్నదే అనుమానం. దీనికి చాలా కారణాలు చెబుతున్నారు.

ఒక కారణం: సినిమా విడుదల జనవరి 9న. అంటే దాదాపు 25 రోజుల ముందుగా ప్రీరిలీజ్ ఫంక్షన్ నా? అంత ముందుగా చేస్తారా? అన్నది ఓ అనుమానం.

రెండవది: తెలంగాణ ఎన్నికలు, ఫలితాలు ఇతరత్రా పనులతో చంద్రబాబు బిజీగా వున్నారు. ఇప్పటికిప్పుడు డిసెంబర్ 16 అంటే ఆయనకు కుదరడం కష్టంకావచ్చు. అదే డిసెంబర్ 25 ప్రాంతంలో అయితే వీలుకావచ్చు అని తెలుస్తోంది.

ఇప్పటికే ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ శ్రియ మీడియా ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కోసం నిర్మాతలను కలిసినా, డిసెంబర్ లో ఈవెంట్ అన్నారట కానీ, డేట్ చెప్పలేదని తెలుస్తోంది. ఏమైనా చంద్రబాబు క్లియరెన్స్ లేకుండా బయోపిక్ వ్యవహారాలు ఏవీవుండవు. అది పక్కా. ప్రీరిలీజ్ ఫంక్షన్ తో సహా.

కులం చెడ్డా సుఖం దక్కుతోందా! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్