Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మాతకు క్లాస్ పీకిన హీరో ?

నిర్మాతకు క్లాస్ పీకిన హీరో ?

హీరోగత ఇండస్ట్రీ మనది. ఇక్కడ హీరోలు ఊ అన్నాకే నిర్మాత ఊ అనాలి. పబ్లిసిటీ స్టిల్స్ అయినా మరే మెటీరియల్ అయినా హీరో చూసి, ఓకె చేసాకే బయటకు వదలాలి. వన్ పర్సంట్ తేడా వచ్చిందో, ఇక అంతే సంగతులు.  ప్రతి చిన్న విషయంలో ఎక్కడ హీరో మనో భావాలు దెబ్బతింటాయో అని నిర్మాతలు టెన్షన్ పడుతూనే వుంటారు.

ఈ మధ్యనే వున్నట్లుండి ఓ కొత్త ప్రాజెక్టు వార్తల్లోకి వచ్చింది. అందరికీ ఆశ్చర్యం. ఈ ప్రాజెక్టు ఈ హీరో ఎప్పుడు ఓకె చేసారా? అని. కొత్త దర్శకుడు. పూర్తిగా వైవిధ్యమైన రా సబ్జెక్ట్. ఈ యంగ్ క్లాస్ హీరో ఎప్పుడు ఓకె చేసాడా అనుకున్నారు. ఇంతలోనే ఈ ప్రాజెక్టు ఫలానా ప్రొడ్యూసర్ అంటూ మరోవార్త. ఆ వెంటనే ఈ సినిమా నేపథ్యం ఇదీ, వ్యవహారం ఇదీ అంటూ ఇంకో వార్త.

దీంతో హీరోకి కాస్త కోపం వచ్చినట్లు తెలుస్తోంది. సదరు నిర్మాతకు ఫోన్ చేసి, ఏమిటిదంతా? ఇదంతా ఎలా బయటకు వచ్చింది? ఎవరు చెబుతున్నారు. మీకు నాకు మాత్రమే తెలిసిన విషయాలు ఎలా బయటకు వెళ్తున్నాయి అని ఆరా తీయడమే కాకుండా, కాస్త గట్టిగానే క్లాసు పీకినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దాంతో ఎక్కడ ప్రాజెక్టు కు బ్రేక్ పడుతుందో అని టెన్షన్ పడడం నిర్మాత వంతు అయిందని బోగట్టా.

మన పాలన-మీ సూచన, 2వ రోజు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?