తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు?

లెక్కప్రకారం తెలంగాణలో లాక్ డౌన్ మరో 4 రోజుల్లో ముగుస్తుంది. మరి ఆ తర్వాతేంటి? తెలంగాణలో లాక్ డౌన్ ను మరోసారి కొనసాగిస్తారా లేక పూర్తిస్థాయిలో ఎత్తేస్తారా? దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నిర్ణయం…

లెక్కప్రకారం తెలంగాణలో లాక్ డౌన్ మరో 4 రోజుల్లో ముగుస్తుంది. మరి ఆ తర్వాతేంటి? తెలంగాణలో లాక్ డౌన్ ను మరోసారి కొనసాగిస్తారా లేక పూర్తిస్థాయిలో ఎత్తేస్తారా? దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు హైదరాబాద్ లో సిటీబస్సులు, మాల్స్ ఓపెనింగ్ పై ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు సీఎం.

తాజా సమాచారం ప్రకారం తెలంగాణలో పరిమిత ఆంక్షలతో లాక్ డౌన్ ను మరోసారి కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు రాత్రిపూట కర్ఫ్యూను కూడా కొనసాగించాలని అనుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే లాక్ డౌన్ పొడిగించినా, కర్ఫ్యూ పెట్టినా.. ఆంక్షల విషయంలో మరిన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటివరకు సిటీబస్సులు నడవడం లేదు. మరోవైపు మెట్రో సర్వీసులు కూడా బంద్ అయ్యాయి. తెలంగాణ మొత్తం బస్సులు తిరుగుతున్నప్పటికీ హైదరాబాద్ ను మాత్రం ఆర్టీసీ టచ్ చేయడం లేదు. శివార్లలోనే బస్సులు ఆపేస్తున్నారు. అటు అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఇప్పటివరకు అనుమతి లేదు. వీటిపై కేసీఆర్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు ఉద్యోగుల జీతాలపై కూడా ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 డిపార్ట్ మెంట్స్ మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మార్చి నుంచి వేతనాల్లో కోత కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది. వచ్చేనెల నుంచి పూర్తిస్థాయి జీతాలు ఇచ్చేలా కేసీఆర్ నిర్ణయం తీసుకునే వీలుంది.

మరోవైపు హోటల్స్, మాల్స్, బట్టల దుకాణాలు తెరవడానికి మాత్రం ముఖ్యమంత్రి అంగీకరించకపోవచ్చు. ఈ వ్యాపారుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ, మరికొన్నాళ్ల పాటు వీటిపై ఆంక్షలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి తెలంగాణలో ఆంక్షల్ని దాదాపుగా ఎత్తేయాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. కంటైన్మెంట్ జోన్లను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితుల్ని తీసుకురావాలని అనుకున్నారు. కానీ సరిగ్గా కేబినెట్ మీటింగ్ కు కొన్ని గంటల ముందు, అంటే నిన్న ఒకేసారి 71 కేసులు నమోదవ్వడం, మరీ ముఖ్యంగా సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్ లో కొత్త కేసులు వెలుగుచూడ్డంతో కేసీఆర్ డైలమాలో పడ్డారు. 

మన పాలన-మీ సూచన, 2వ రోజు