నిర్మాతగా వెంకీ?

సురేష్ ప్రొడక్షన్స్..ఈ బ్యానర్ గోల్డ్. ఎన్నో హిట్ సినిమాలు నిర్మించింది. ఇది ఫ్రయివేట్ లిమిటెడ్ సంస్థ. ఇందులో సురేష్ బాబు, వెంకటేష్ బాబు, ఇంకా ఎందరికో భాగస్వామ్యం వుంది. సురేష్ బాబు హయాం వచ్చిన…

సురేష్ ప్రొడక్షన్స్..ఈ బ్యానర్ గోల్డ్. ఎన్నో హిట్ సినిమాలు నిర్మించింది. ఇది ఫ్రయివేట్ లిమిటెడ్ సంస్థ. ఇందులో సురేష్ బాబు, వెంకటేష్ బాబు, ఇంకా ఎందరికో భాగస్వామ్యం వుంది. సురేష్ బాబు హయాం వచ్చిన దగ్గర నుంచి దీనికి నిర్మాతగా ఆయన పేరే వుంటూ వస్తోంది. రామానాయుడు సమర్పించేవారు. 

ఇప్పుడు ఇదే కుటుంబం నుంచి మరో నిర్మాణ సంస్థ ప్రారంభమవుతోందని తెలుస్తోంది. హీరో వెంకటేష్ తను ఓ ప్రొడక్షన్ హవుస్ లాంటిది ప్రారంభించే యోచనలో వున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు ఓ సంస్థను ప్రారంభించారు. 

తండ్రి పద్మాలయా వుండగానే. అలాగే సురేష్ మూవీస్ సంస్థ వుండగానే వెంకీ మరో సంస్థను ప్రారంభిస్తారని వినికిడి. త్వరలో ఆయన ఈ విషయాన్ని ప్రకటిస్తారని టాలీవుడ్ బోగట్టా.