మెగా ప్రిన్సెస్ అంటూ ఫ్యాన్స్ తెగ హడావుడి. కానీ రెండు డిజాస్టర్ల తరువాత మూడోది వచ్చింది. కానీ సినిమాకు అతి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా బాగోగులు పక్కన పెడితే, థియేటర్లు వెలవెలబోయాయి. పది, పదిహేను టికెట్ లు తెగడం ఆశ్చర్యకరం. మరోపక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఓపెనింగ్స్ కుమ్మేసాయి.
టాలీవుడ్ లో వైవిధ్యమైన హీరోయిన్ పాత్రల కోసం టాలీవుడ్ ఫ్యామిలీల నుంచి యత్నించిన వారిలో నిహారిక రెండోవారు. మంచు ఫ్యామిలీ నుంచి మంచులక్ష్మి కాస్త ప్రయత్నించారు. ఆమె కనీసం కాస్త ఎక్కువ సినిమాలు, షోలు చేసారు. కానీ నిహారిక పరాయాలతో స్టార్ట్ చేసి, పరాజయాలతోనే ముగించేలా వున్నారు.
అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి బ్యానర్ అనిపించుకున్న నిర్వాణ మూవీస్ కు కూడా ఇది ఝలక్ నే. తొలిసినిమా మను డిజాస్టర్. మలి సినిమా ఇది. దీనికి అమ్మకాలు లేవు, కనీసపు ఓపెనింగ్స్ కూడా లేవు. విడుదల రోజునే ఇలావుంటే ఇక ఫస్ట్ వీకెండ్ తరువాత పరిస్థితి ఏమిటో?