Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ - భీష్మ..సింగిల్ ఫరెవర్

నితిన్ - భీష్మ..సింగిల్ ఫరెవర్

చకచకా మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ త్వరలో మరో ప్రాజెక్టు ప్రకటించబోతోంది. ఈ సినిమాకు నితిన్ ను హీరోగా ఎంపికచేసుకుంది. ఛలో సినిమాతొ హిట్ కొట్టిన డైరక్టర్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమాకు భలే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. లవ్ జోనర్ లో అందించే ఈ సినిమాకు ‘భీష్మ’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారట.

బ్రహ్మచారిగా వుండిపోయిన భీష్ముడి పేరుతో ప్రేమ సినిమా అన్న ఐడియానే చిత్రంగా వుంది. పైగా ట్యాగ్ లైన్ కూడా భలేగా వుంది. ‘సింగిల్ ఫరెవర్’ అన్నది ట్యాగ్ లైన్ అంట. అంటే టోటల్ గా నితిన్-వెంకీ కుడుమల చేయబోయే సినిమా ‘భీష్మ-సింగిల్ ఫరెవర్ ‘ అన్నమాట.

ప్రేమమ్, బాబు బంగారం తరువాత శైలజరెడ్డి అల్లుడు, జెర్సీ, శర్వానంద్ సినిమాలు లైన్ లో వున్నాయి ఇదే సంస్థకు. ఇప్పుడు ఆరో ప్రాజెక్టుగా నితిన్ తో సినిమా అనౌన్స్ చేస్తారు.

గతంలో సితార మాతృసంస్థ హారిక హాసినిలో త్రివిక్రమ్ డైరక్షన్ లో నితిన్ అ..ఆ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది రెండో సినిమా అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?