నితిన్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో ప్లానింగ్ లో వున్న సినిమా ఒకటి వుంది. టాగోర్ మధు, సుధాకరరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ లో ప్రారంభయ్యే అవకాశం వుంది. అయితే సినిమా నాన్ థియేటర్ అంటే శాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ ఆల్ ఇండియా రైట్స్ ఇలా అన్నీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసేసింది.
ఇక కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే నిర్మాతల దగ్గర వుంటాయి. టోటల్ నాన్ థియేటర్ హక్కుల కింద 21 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ తీసేసుకుంది. ఇక ఎలా లేదన్నా థియేటర్ హక్కులు ఇరవై కోట్ల వరకు వస్తాయి.
సినిమాను కనుక 30 కోట్లలో ఫినిష్ చేయగలిగితే సాలిడ్ గా 10 కోట్ల లాభం అన్నమాట. ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ ఆమె డేట్లు అడ్జస్ట్ కావడం లేదు. దానికోసమే ప్రయత్నాల్లో వున్నారు. ఈ సినిమా కన్నా ముందుగా హీరో నితిన్ ఎడిటర్ శేఖర్ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది.