Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ ఎంత స్మార్ట్

నితిన్ ఎంత స్మార్ట్

కాస్త గ్యాప్ తరువాత హీరో నితిన్ చేస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాలో నితిన్ లుక్ ఒకటి లీక్ అయింది. ఈ లుక్ లో నితిన్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. మాంచి ఫిట్ నెస్ తో కనిపిస్తూ, కాస్త స్లిమ్ అయినట్లు అనిపిస్తున్నాడు. పక్కా క్లాస్ టచ్ తో వుంది లుక్. ఇప్పుడు బయటకు వచ్చిన నితిన్ లుక్ చాలా ప్రామిసింగ్ కా వుంది. నితిన్ మాన్లీగా వుంటాడు. సరైన హిట్ లు పడడంలేదు, అది బ్యాడ్ లక్ నో, బ్యాడ్ స్క్రిప్ట్ లో? కారణం.

కానీ ఇప్పుడు లుక్ దగ్గర నుంచి అన్నింటా కేర్ తీసుకుంటున్నాడు. అందుకు సాక్ష్యమే ఈ పిక్ అనుకోవాలి. భీష్మ, రంగ్ దే, అలాగే చంద్రశేఖర్ యేలేటి సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేసి, ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు నితిన్. డిసెంబర్ 6న భీష్మ సినిమాను విడుదల చేయడం అన్నది టార్గెట్ గా పెట్టుకుని, సినిమాను చకచకా రెడీ చేస్తున్నాడు.

ఈ సినిమా వెనుకనే రంగ్ దే సినిమాను కూడా రెడీ చేయడానికి వీలుగా స్క్రిప్ట్ ఫైనల్ చేసి, కాస్టింగ్ వగైరా పనులు స్టార్ట్ చేసేసారు దర్శకుడు వెంకీ అట్లూరి. మొత్తం మీద నితిన్ కెరీర్ మళ్లీ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. ఈ సినిమాల తరువాత కృష్ణచైతన్య ప్రాజెక్టు ఒకటి పెండింగ్ లో వుంది. అదికాస్త భారీ ప్రాజెక్టు. అందువల్ల అది కాస్త వెనుకగా టేకప్ చేసే అవకాశం వుంది.

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?