మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి 2020కి స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య పోటీ ఫిక్స్ అయిపోయింది. ఇటు మహేష్ సినిమా, ఆటు బన్నీ సినిమా సంక్రాంతికే అని రెండు సినిమాల యూనిట్ ల నుంచి క్లారిటీ వచ్చేసింది. మహేష్ సినిమా డేట్ సంక్రాంతికే అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్ది సేపటికే హారిక హాసిని యూనిట్ నుంచి కూడా క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతికే తమ సినిమా విడుదల అంటూ.
చిత్రమేమిటంటే రెండు యూనిట్ ల నుంచి డేట్ మాత్రం రాలేదు. జనవరి 10, 11, 12 తేదీలు విడుదలకు వున్నాయి. అయితే ఈసారి బన్నీ సినిమా వెనకే వస్తుందని తెలుస్తోంది. అందుకే డేట్ ఇవ్వలేదు. మహేష్ సినిమా 10 అంటే ఇది 11కి, అది 11 అంటే ఇది 12కు పక్కా అన్నమాట. మొత్తానికి ఈ రెండింటికి మాత్రం పోటీ అనివార్యం అయిపోయింది. ఈ సినిమాల వెనుకే రజనీ సినిమా విడుదల వుంది.
ఇక క్లారిటీ రావాల్సింది బాలకృష్ణ–కేఎస్ రవికుమార్ సినిమా నుంచే. అది ఇంకా ప్రారంభం కాలేదు. సంక్రాంతికే అని నిర్మాత సి కళ్యాణ్ అంటున్నారు. కానీ సినిమా స్టార్ట్ కావాలి. ఫినిష్ కావాలి. అప్పటి సంగతి. అదే జరిగితే సంక్రాంతి రేస్ లో ఫోర్త్ కాంపిటీటర్ గా బాలయ్య కూడా రంగంలోకి దిగిపోతారు.