Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్-వెంకీ-హారిక హాసిని

నితిన్-వెంకీ-హారిక హాసిని

వెంకీ అంటే విక్టరీ వెంకటేష్ కాదు. వెంకీ కుడుముల. ఛలో సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్న కుర్రాడు. ఇప్పుడు ఈ కుర్ర డైరక్టర్ తన తరువాత సినిమాను నితిన్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రెండో సినిమా తమ బ్యానర్ లో అంటే తమ బ్యానర్ లో అని చాలా మందే అడిగినా, తనను సినిమా రంగంలో ఆదుకున్న హారిక హాసినికే రెండో సినిమా కమిట్ అయ్యాడు వెంకీ.

హారిక హాసిని సిస్టర్ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించే ఈ సినిమాకు నితిన్ ను హీరోగా అనుకుంటున్నారు. నితిన్ కు సరిపోయే కథను తయారుచేయమని హారిక హాసిని చినబాబు డైరక్టర్ ను అడగడం, దానికి వెంకీ ఓకె అనడం జరిగిపోయింది.

ఇదే ఫిక్సయితే చినబాబు యూనిట్ లో నితిన్ కు రెండో సినిమా అవుతుంది. గతంలో అ..ఆ సినిమా చేసాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?