మహానటి సినిమాకు ఆది నుంచీ లీకుల సమస్యే. ఆ సినిమాకు పనిచేసే ఓ టెక్నీషియన్ అత్యుత్సాహం, పబ్లిక్ రిలేషన్స్ మీద వున్న దృష్టి పుణ్యమా అని ఏదో ఒక లీకు బయటకు వస్తూనే వుంది. అయితే అందులో సగం నిజాలు, సగం గాలి వార్తలు కావడంతో సమస్య వస్తొంది.
రీసెంట్ గా మహానటిలో అలనాటి మేటి హీరోయిన్ భానుమతి క్యారెక్టర్ వుందని, దానికి అనుష్కను తీసుకుంటున్నారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, ఇప్పటి వరకు అనుష్కను సంప్రదించింది లేదు, ఆమె ఓకె అన్నదీ లేదట.
వాస్తవానికి ఇండస్ట్రీలో కనిపించిన ప్రతి వాళ్లనీ ఏదో ఒక క్యారెక్టర్ కు తీసేసుకుంటున్నట్లు వార్తలు వున్నాయి. అయితే అన్నీ దాదాపు పాస్ ఆన్ క్యారెక్టర్లేనట. భానుమతి అయినా ఎన్టీఆర్, ఏఎన్నార్ అయినా మహా అయితే ఒక రోజు కాల్ షీట్ క్యారెక్టర్లేనట. అందువల్ల అనుష్క ఎస్ అంటుందా? నో అంటుందా? అన్నది డౌట్ గా వుండి అడగలేదట.
కానీ అనుష్క అయితే బాగుంటుందని యూనిట్ కు చెందిన ఓ లీకు వీరుడు ఆ మేరకు వార్తలు పుట్టించినట్లు తెలుస్తోంది.