Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ నష్టాలు కూడా భర్తీ చేసారా?

స్పైడర్ నష్టాలు కూడా భర్తీ చేసారా?

అజ్ఞాతవాసి నష్టాలను బయ్యర్లకు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. నష్టాల మేరకు కాకున్నా, వీలయింనతగా వెనక్కు చెల్లించారు హారిక హాసిని అధినేత చినబాబు. అయితే ఇలా మరే సినిమాకు జరగలేదని ఇండస్ట్రీ టాక్. ఎక్కడో ఒకరిద్దరు బయ్యర్లకు అడ్జస్ట్ చేయడం తప్ప, అందరికీ కలిపి ఎంతో కొంత చేయడం అన్నది లేదన్నది పాయింట్.

కానీ మహేష్ బాబు స్పైడర్ సినిమాకు సంబంధించి కూడా అజ్ఞాతవాసి రేంజ్ లో కాకున్నా, కాస్త రీజనబుల్ గానే వెనక్కు ఇచ్చినట్లు ఆలస్యంగా అందిన వార్తలను బట్టి తెలుస్తోంది.

స్పైడర్ ను బయ్యర్లకు విక్రయించిన తరువాత లెక్క ప్రకారం ఏరియాల వారీ సేల్స్ మీద జీఎస్టీ అమౌంట్ ను కొన్నవారే చెల్లించుకోవాల్సి వుంది. కానీ సినిమా ఫలితం తేడా రావడంతో అయిదున్నర కోట్లకు పైగా జీఎస్టీని నిర్మాతలే చెల్లించేసారట. అలాగే కాస్త ఎక్కువ నష్టపోయిన దిల్ రాజుకు కొంత మొత్తం భర్తీ చేసారట.

ఇప్పుడు స్పైడర్ నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ కణం సినిమాను తెలుగు రాష్ట్రాలకు ఓవర్ సీస్ కు తీసుకున్నారు. హిట్ లతో వున్న సాయిపల్లవి, నాగశౌర్య కాంబినేషన్ సినిమా ఇది. మార్చి ఫస్ట్ వీక్ లో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

రెండున్నర కోట్లకు పైగా తీసుకున్న ఈ సినిమాను కూడా స్పైడర్ బయ్యర్లకే ఇస్తున్నారు. అది కూడా కాస్ట్ టు కాస్ట్ కింద. ఆ విధంగా మరికొంత భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి ఏదో ఒకటి బయ్యర్లకు ఉపశమనం. మరీ సర్దార్ గబ్బర్ సింగ్ మాదిరిగా కాకుండా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?