నితిన్ హీరోయిన్ మిస్థి

మొత్తానికి నితిన్ తన తాజా సినిమా సంగతి వెల్లడించాడు. కొరియర్ బాయ్ కళ్యాణ్ సంగతి ఏమీ తెలియకపోవడం, సురేందర్ రెడ్డి శిష్యుడి సినిమా మొగ్గలోనే ఆగిపోవడం, మారుతి సినిమా అనుకుంటే అదీ లేకపోవడంతో, రకరకాల…

మొత్తానికి నితిన్ తన తాజా సినిమా సంగతి వెల్లడించాడు. కొరియర్ బాయ్ కళ్యాణ్ సంగతి ఏమీ తెలియకపోవడం, సురేందర్ రెడ్డి శిష్యుడి సినిమా మొగ్గలోనే ఆగిపోవడం, మారుతి సినిమా అనుకుంటే అదీ లేకపోవడంతో, రకరకాల కథనాలు పుట్టాయి. దీంతో నితన్ తన తాజా సినిమాపై ట్వీట్ చేసాడు. 

కరుణాకరన్ తో సినిమా చేస్తున్నానని, తన సోదరి బ్యానర్ పైనే వుంటుందని తెలిపాడు హీరోగా బాలీవుడ్ లో సుభాష్ ఘాయ్ పరిచయం చేసిన మిస్థీ నటిస్తుందని వెల్లడించాడు. అంటే తెలుగు తరెకు మరో క్రేజీ హిరోయిన్ పరిచయం కాబోతోందన్నమాట. యూత్ ఫుల్ లవ్ స్టోరీలు ఎంచుకుంటూ సక్సెస్ లు కొడుతున్న నితిన్ ఇప్పుడు కరుణాకరన్ ను ఎందుకోవడం మంచి చాయిస్ అనుకోవాలి.