టాలీవుడ్ పెద్ద సినిమాలంటే తెలుగు మీడియాకు ఇంతా అంతా ఆసక్తి కాదు,.తమకు సమాచారం అందినా అందకున్నా, ఎక్కడో అక్కడి నుంచి సంపాదించి మరీ ప్రచారం సాగిస్తాయి. అందుకు టాలీవుడ్ పెద్ద సినిమా జనాలు కూడా తెలుగు మీడియాను కడ పంక్తి లో కూర్చోపెడతారు. చివర్న చేసి, పంక్తి భోజనాల్లో పేరంటాల ఇంటర్వూలు పెడతారు.
ఇప్పుడు మనం సంగతే చూడండి. ఓ ఆంగ్ల దినపత్రికతో లక్షల ఖర్చుతో ప్రచారం కాంట్రాక్టు కుదుర్చుకున్నారని వినికిడి. ఇంకనే నాగ్ ఇంటర్వూలు, మనం విశేషాలు అన్నీ ఆ మీడియాకే. కానీ అలా అని మన తెలుగు మీడియా ఊరుకుంటుందా? ఆనందంగా ఆ ఎంగిలి విస్తరిలోంచే విశేషాలు ఏరుకుని, మన జనాలకు అందించడం చేస్తుంది. నాగ్ ఆ ఇంటర్వూలో ఇలా అన్నాడు..నాగ్ అక్కడ ఈ ముచ్చట వెల్లడించాడు అంటూ ఆనందగా ఇక్కడ నెమరేయడం మామూలే.
అంతేకానీ కాస్త దూరంగా వుంటే, ప్రచారం కోసం వాళ్లంతట వాళ్లే పిలుస్తారు అని ఎవరూ ఆగరు. ర్యాట్ రేస్ మాదిరిగా నేను, ముందిచ్చానా..నేను ముందిచ్చానా అని వెంబడపడడంతో, తెలుగు మీడియా సంగతి అర్ధమైపోయింది. అందుకే కడపంక్తిన కూర్చో పెడుతున్నారేమో?