అభిషేక్ బచ్చన్, నిత్యా మేనన్ లు నటించిన 'బ్రీత్: ఇంటూ ది షాడోస్' వెబ్ సీరిస్ ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించింది. అమెజాన్ రూపొందించిన ఈ వెబ్ సీరిస్ ఈ మధ్యనే విడుదల అయ్యింది. సుదీర్ఘ సమయం వెచ్చించి వెబ్ సీరిస్ లను కంప్లీట్ గా చూడటం అంత తేలికైన పనేమీ కాదు. ఇండియాలో వెబ్ సీరిస్ లను ఆసాంతం చూసేలా సమయాన్ని కేటాయించగలిగే వాళ్లు తక్కువమందే అనుకోవాలి. ఇలాంటి క్రమంలో నిత్యామేనన్ నటించిన వెబ్ సీరిస్ ఏ మేరకు ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు కూడా ఇంకా వెబ్ లో పూర్తి స్థాయిలో రావడం లేదు.
ఆ సంగతలా ఉంటే.. బ్రీత్ వెబ్ సీరిస్ మరో రకంగా హాట్ టాపిక్ గా మారింది. నిత్యా మేనన్ లిప్ కిస్ సీన్లో రెచ్చిపోవడంతో ఈ సీరిస్ ప్రచారానికి నోచుకుంటూ ఉంది. అది కూడా లెస్బియన్ కిస్ కావడం గమనార్హం. ఇప్పటి వరకూ పెద్ద తెరపై చాలా సినిమాల్లో నటించినా నిత్యామీనన్ ఎక్స్ పోజింగ్, లిప్ కిస్ లకు దూరదూరంగానే ఉంటూ వచ్చింది. మణిరత్నం సినిమాలోనే కాస్త రొమాంటిక్ సీన్లలో కనిపించింది.
ఇప్పుడు ఉన్నట్టుండి ఈమె లెస్బియన్ తరహా లిప్ కిస్ లో కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే నిత్య ఈ తరహా పాత్ర ఇది వరకే చేసింది. తెలుగు సినిమా 'అ!'లో ఈమె అలా కనిపించినా, అందులో అలాంటి సీన్లేమీ ఉండవు. ఇప్పుడు మాత్రం నిత్యామేనన్ అలాంటి సీన్లలో నటించడానికి మొహమాటపడినట్టుగా లేవు. పెద్ద తెర మీద హద్దుల్లో పెట్టుకుని నటించిన నిత్య, ఈ వెబ్ సీరిస్ ను బాగా ఇష్టపడినట్టుగా ఉంది.