నైజాం ఫస్ట్ డే షేర్ ల్లో ప్రస్తుతం థర్డ్ ప్లేస్ ఎన్టీఆర్ దే. బాహుబలి వన్, టూ తరువాత అయిుదున్నర కోట్లతో థర్డ్ ప్లేస్ లో వున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును తానే దాటేలా కనిపిస్తోంది. నైజాంలో తొలి రోజు అరవింద సమేత వీర రాఘవ సుమారు ఆరు కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తోంది. ఫస్ట్ షో ముగిసి, సెకండ్ షో నెంబర్లు చూస్తుంటే కచ్చితంగా అయిదున్నర కోట్లను అయితే దాటుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే, ఆంధ్రలో మాదిరిగా రెండు వందలు, నూటాయాభై యూనిఫారమ్ రేటు అమ్మకున్నా, కొద్దిగా రేటు పెంచారు. అంటే 100 రూపాయిల టికెట్ మీద జీఎస్టీ ఎంత వుంటుందో ఆ మేరకు రేటు పెంచారు. అందువల్ల కలెక్షన్లు రెగ్యులర్ బిగ్ మూవీస్ కు ఫస్ట్ డే వుండే కన్నా 20శాతం ఎక్కువే వుండే అవకాశం వుంది.
ఏ మాత్రం అదనంగా కలపకుండా వుంటే అయిదున్నర కోట్ల కు కాస్త అటుగా వుంటుంది. హీరో, రికార్డులు అంటూ కాస్త కలపడం అన్నది అందరి హీరోలకు జరిగే వ్యవహారం. అలా కలిపితే ఆరు కోట్ల వరకు వుంటుంది. నైజాం ఏరియాకు అన్నీ కలుపుకుని, దిల్ రాజు 18 కోట్లకు అరవిందను తీసుకున్నారు. ఈ లెక్కన ఫస్ట్ డే వన్ థర్డ్ రికవరీ వచ్చినట్లు అవుతుంది.