ఐదో పాటపై ఆశ వదులుకుంటే మంచిది

అరవింద సమేతకు సంబంధించి అనుకున్న టైమ్ కంటే షెడ్యూల్స్ ఆలస్యంగా నడిచిన విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఆలస్యానికి ఓ మంచి పాట బలైపోయింది. అవును.. అరవింద సమేతలో…

అరవింద సమేతకు సంబంధించి అనుకున్న టైమ్ కంటే షెడ్యూల్స్ ఆలస్యంగా నడిచిన విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఆలస్యానికి ఓ మంచి పాట బలైపోయింది. అవును.. అరవింద సమేతలో ఐదోపాట లేదు. ఉండదు కూడా.

ప్రస్తుతం విడుదలైన 4 పాటల్లో రెండు మాత్రమే హుషారుగా ఉన్నాయి. ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ ఎలివేట్ చేసే పాటలవి. అనగనగనగా, రెడ్డి ఇక్కడ సూడు పాటల్లో మాత్రమే ఎన్టీఆర్ డాన్స్ ఉంటుంది. అయితే ఇదే కోవలో ఐదోపాట కూడా ఉంది. అది మంచి ఫాస్ట్ బీట్. మరీ ముఖ్యంగా వెస్ట్రన్ స్టయిల్ లో సాగే బీట్.

ఇలాంటి వెస్ట్రన్ బాణీకి ఎన్టీఆర్ స్టెప్పులు తోడైతే ఆ కిక్కేవేరు. కానీ షెడ్యూల్స్ లో జాప్యం కారణంగా ఆ ఐదోపాటను తొలిగించారు. సినిమా విడుదల తర్వాత ప్రచారంలో భాగంగా డిలీటెడ్ సీన్స్ కింద విడుదల చేస్తారేమో అనే ఆశ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ పాటను కనీసం షూట్ కూడా చేయలేదు.

టైమ్ లేకపోవడంతో అరవింద సమేత ఐదోపాటను వదిలేశారు. ట్యూన్ ఫైనల్ చేసి, రికార్డింగ్ కూడా పూర్తిచేసిన తర్వాత పాటను పక్కనపెట్టాల్సి వచ్చింది. అలా 4 పాటలతోనే థియేటర్లలోకి వస్తోంది అరవింద సమేత.

అయితే ఇక్కడ ప్రేక్షకులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆ ఐదోపాట అరవింద సమేతలో లేకపోయినా, తన అప్ కమింగ్ మూవీస్ లో ఎక్కడో ఒకచోట ఆ ట్యూన్ ను ఇరికించేస్తాడు తమన్. నో డౌట్.