అరవింద సమేత వీరరాఘవ సినిమా ఆల్బమ్ లో ముందుగా బయటకు వచ్చిన పాట 'అనగనగా అరవిందట తన పేరు'. ఆ పాట స్లోగా జనాల్లోకి వెళ్లి, స్టడీ హిట్ అయింది. ఇప్పుడు ఆ పాట ప్రోమోను విడుదల చేసారు. ట్రయిలర్ లో ఫుల్ సీరియస్ వ్యవహారాలు, ఫైట్లు, ఇతరత్రా నిండిపోవడంతో, కాస్త నీరసపడిన ఫ్యాన్స్ ను ఈ ప్రోమో ఫుల్ ఖుష్ చేసేసేలా వుంది.
ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ, హీరో అంటే డ్యాన్స్ మాత్రమే కాదని, నటనలో ఓ భాగం మాత్రమే డ్యాన్స్ అని ఎన్టీఆర్ చెప్పాడు. అందుకే ఈ సినిమాలో డ్యాన్స్ మూవ్ మెంట్ కు తగిన పాటలు లేవన్న విమర్శ తగదని ఇండైరక్ట్ గా చెప్పాడు ఎన్టీఆర్.
కానీ ఇప్పుడు వదిలిన ప్రోమో చూస్తే, సినిమా మొత్తంమీద ఒక్కపాట చాలు ఎన్టీఆర్ చెలరేగిపోవడానికి అని క్లియర్ అయింది. ప్రోమోలో ఎన్టీఆర్ స్టెప్స్ అదిరాయి. చాలా ఈజ్ తో డ్యాన్స్ చేసాడు ఎన్టీఆర్. ఈ లెక్కన రెడ్డీ ఇక్కడ చూడు పాట ప్రోమో కూడా వచ్చేస్తే, ఫ్యాన్స్ కు ఇక ముందుగా దసరా వచ్చేసినట్లే.