ఫ్యాన్స్ కు మళ్లీ హ్యాండ్ ఇచ్చిన చరణ్

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ అన్నారు అజర్ బైజాన్ షెడ్యూల్ వెంటనే ఫస్ట్ లుక్ అన్నారు మధ్యలో వినాయకచవితి పండగ కూడా వచ్చి వెళ్లింది ఈ  అకేషన్స్ అన్నీ దాటిపోయాయి. ఫస్ట్ లుక్…

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ అన్నారు
అజర్ బైజాన్ షెడ్యూల్ వెంటనే ఫస్ట్ లుక్ అన్నారు
మధ్యలో వినాయకచవితి పండగ కూడా వచ్చి వెళ్లింది

ఈ  అకేషన్స్ అన్నీ దాటిపోయాయి. ఫస్ట్ లుక్ మాత్రం రాలేదు. చివరికి దసరా లాంటి ఫెస్టివ్ డేట్ ను కూడా వదులుకున్నాడు రామ్ చరణ్. నిన్నంతా రామ్ చరణ్, బోయపాటి సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వస్తుందని కళ్లుకాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. 

ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు సరికదా, కనీసం ఆ లుక్ ఎప్పుడొస్తుందనే విషయాన్ని కూడా చెప్పలేదు చరణ్. దీంతో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనే చరణ్ ను, నిర్మాత దానయ్యను కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

ఈ సినిమాకు వినయ విధేయ రామ్ అనే టైటిల్ పెట్టారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. సో.. అదే టైటిల్ తో దసరాకు ఫస్ట్ లుక్ వస్తుందని ఆశించారంతా. కానీ అలా జరగలేదు. ఫ్యాన్స్ కు మరోసారి ఆశాభంగమే ఎదురైంది. టైటిల్ పై ఓ ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్లనే ఫస్ట్ లుక్ రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. 

రీసెంట్ గా సైరా సినిమాకు సంబంధించి జార్జియా షెడ్యూల్ పూర్తిచేశాడు చిరంజీవి. హైదరాబాద్ వచ్చిన వెంటనే రామ్ చరణ్ సినిమా టైటిల్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటివరకు అభిమానులకు ఈ సస్పెన్స్ తప్పదు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి