మహేష్ మూవీలో ‘స్పెషల్’ సరుకు లేదు

టాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ స్పెషలిస్ట్ అంటే దేవిశ్రీప్రసాద్. అతడ్ని కంపోజర్ గా తీసుకున్న ఏ దర్శకుడైనా ఐటెంసాంగ్ వైపు మొగ్గుచూపుతాడు. కానీ డైరక్టర్ కొరటాల శివ మాత్రం దీనికి మినహాయింపు. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే.…

టాలీవుడ్ లో ఐటెంసాంగ్స్ స్పెషలిస్ట్ అంటే దేవిశ్రీప్రసాద్. అతడ్ని కంపోజర్ గా తీసుకున్న ఏ దర్శకుడైనా ఐటెంసాంగ్ వైపు మొగ్గుచూపుతాడు. కానీ డైరక్టర్ కొరటాల శివ మాత్రం దీనికి మినహాయింపు. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే.

ప్రస్తుతం మహేష్ హీరోగా భరత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ఐటెంసాంగ్ లేదు. కేవలం సందర్భానుసారం మాత్రమే పాటలు ఉంటాయని, ప్రత్యేక గీతాలంటూ ఏమీ ఉండవని స్పష్టంచేశాడు కొరటాల.

నిజానికి గత చిత్రం జనతా గ్యారేజ్ లో కూడా ఐటెంసాంగ్ పెట్టాలని అనుకోలేదు కొరటాల. కాకపోతే సినిమా సెకెండాఫ్ చాలా సీరియస్ గా ఉందని భావించి, ఐటెంసాంగ్ పెట్టమని ఎన్టీఆర్ స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో తప్పలేదు. అలా ఆఖరి నిమిషంలో దేవిశ్రీ ఓ స్పెషల్ సాంగ్ ఇవ్వడం, కాజల్ అందులో హాట్ హాట్ గా డాన్స్ చేయడం చకచకా జరిగిపోయాయి.

భరత్ అనే సినిమాకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి 'లాస్ట్ మినిట్ డెసిషన్లు' తీసుకోలేదు. సో.. ఈ సినిమాలో దాదాపు ఐటెంసాంగ్ లేనట్టే. మహేష్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. జనతా గ్యారేజ్ టైపులోనే ఈ సినిమా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనల్ గా, సీరియస్ గా ఉండబోతోంది.