ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందు నుంచే చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. మరోవైపు ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి గతంలోనే విస్పష్టంగా ప్రకటించినప్పటికీ అమలాపాల్ లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. దీంతో బోయపాటి మరోసారి రంగంలోకి దిగాడు.
బాలయ్య సినిమా కోసం పేరున్న, క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకోవడం లేదని మరోసారి స్పష్టంచేశాడు బాలయ్య. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఇద్దరు కొత్తమ్మాయిల్ని ఫైనలైజ్ చేశామని, వాళ్లలోంచి ఒకర్ని ఫిక్స్ చేస్తామని తెలిపాడు.
బోయపాటి ప్రకటనతో బాలయ్య సినిమా హీరోయిన్లపై ఇన్నాళ్లూ వచ్చిన పుకార్లకు చెక్ పడింది. ఆ కొత్తమ్మాయి ఎవరనే ఆసక్తి అందర్లో నెలకొంది.
లాక్ డౌన్ కారణంగా బాలయ్య-బోయపాటి సినిమా షూటింగ్ ఆగిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ నుంచి తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.