Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స‌మంత‌కు అత‌డి బర్త్ డే పార్టీకి పిలుపు లేదా!

స‌మంత‌కు అత‌డి బర్త్ డే పార్టీకి పిలుపు లేదా!

తెలుగు సినిమా స్టార్లు ఇప్పుడు మాటెత్తితే పాన్ ఇండియా అంటున్నారు! తెలుగులో వ‌చ్చే సినిమాల‌న్నింటికీ ఇప్పుడు పాన్ ఇండియా ముద్ర ప‌డిపోతోంది! అన్నీ పాన్ ఇండియా సినిమాలేన‌ట‌! మీడియా కూడా ఈ ఓవ‌ర్ హైప్ ను ఇవ్వ‌డంలో విశ్ర‌మించ‌డం లేదు.

మ‌రి పాన్ ఇండియా అంటూ వీళ్ల తొడ‌లు వీళ్లు కొట్టుకోవ‌డం ఒకింత విడ్డూర‌మైన అంశం కూడా మారుతోంది క్ర‌మంగా. మ‌రి తెలుగు సినిమా స్టార్ల పాన్ ఇండియా ఇమేజ్ కు వారికి బాలీవుడ్ బంధం రుజువుగా మారింది. పాన్ ఇండియా స్టార్లు అంటే.. ముంబైలో కూడా జ‌నాలు గుర్తు ప‌ట్టాలి. జ‌నం గుర్తు ప‌డుతున్నారంటే ముంబై సినిమా వాళ్లు కూడా వీరితో చిందులేస్తారు. పార్టీలిస్తారు.

క‌ర‌ణ్ జొహార్ యాభైయ‌వ పుట్టిన రోజు వేడుక‌లు చాలా గ్రాండ్ గా జ‌రిగాయి. త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను చాలా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు ఈ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌. బాలీవుడ్ నుంచి సౌత్ సినిమాతో ఇప్పుడు బాగా ట‌చ్లో ఉన్న‌ది క‌ర‌ణ్ జొహారే!

తెలుగు, త‌మిళ సినిమాల‌ను హిందీలో రీమేక్ చేయ‌డం. వీటి హిందీ వెర్ష‌న్ల‌ను విడుద‌ల చేయ‌డం, డ‌బ్బింగ్ లు చేయించ‌డం... ఇలా తెలుగు సినిమా మీద‌, త‌మిళ సినిమాల మీద క‌ర‌ణ్ క‌న్నుంది ఇప్పుడు. ఇలాంటి నేప‌థ్యంలో.. త‌ను గ్రాండ్ గా చేసుకున్న పార్టీకి చాలా మందినే పిలిచాడు. అయితే వారిలో సౌత్ సెల‌బ్రిటీలు పెద్ద‌గా లేరు!

తెలుగులో గుర్తింపు ఉన్న త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ వంటివారు ఈ పార్టీకి హాజ‌ర‌య్యారు. అయితే వీరు బాలీవుడ్ లో సినిమాలు చేసిన వారు, ఉత్త‌రాది, ఆ పై స‌రుకే కాబ‌ట్టి వీరిని టాలీవుడ్ కోటాలో క‌ల‌ప‌లేరు. వీరిని మిన‌హాయిస్తే.. సౌతిండియా పాన్ ఇండియా మూవీ మేక‌ర్స్ ను క‌ర‌ణ్ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టుగా లేడు.

ఇక క‌ర‌ణ్ కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే విషెష్ చెప్పింది స‌మంత‌. ఆమె కూడా క‌ర‌ణ్ పార్టీలో క‌నిపించ‌లేదు. అందులోనూ స‌మంత కూడా ఇప్పుడు బాలీవుడ్ పై క‌న్నేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌ర‌ణ్ పార్టీలో సమంత క‌నిపించ‌లేదు.

పూరీ, చార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ హాజ‌రైన‌ప్ప‌టికీ.. వీరి సినిమాకు క‌ర‌ణ్ జొహార్ ఇప్పుడు హిందీ వెర్ష‌న్ కేమో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆ కోటాలో వీరు ఆహ్వానం పొందిన‌ట్టే.వీరిని మిన‌హాయిస్తే బాలీవుడ్ బిగ్ షాట్ల పార్టీలో పాన్ ఇండియా స్టార్లు లేరు!

బాలీవుడ్ లో చోటాబ‌డాలంతా హాజ‌రైన ప్ర‌ముఖుడి బ‌ర్త్ డేకు సౌతిండియా పాన్ ఇండియా స్టార్లు ఆహ్వానం పొంద‌లేక‌పోవ‌డం అవ‌మానం ఏమీ కాదు కానీ, పాన్ ఇండియా స్టార్ల‌కు ముంబైలో అంత సౌండ్ లేద‌ని మాత్రం క్లారిటీ వ‌స్తోంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా