Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నోటా కోసం రంగంలోకి విజయ్

నోటా కోసం రంగంలోకి విజయ్

నోటా విడుదల వ్యవహారం మొత్తంమీద ట్విట్టర్ కు ఎక్కేసింది. నోటా విడుదల విషయమై వరుసగా ఇన్ సైడ్ స్టోరీలు గ్రేట్ ఆంధ్ర అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అయిదున విడుదల చేసేంత టైమ్ లేక, 18న విడుదల చేద్దామని నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా పట్టుదల. కానీ నిర్మాత దిల్ రాజు ససేమిరా అంటున్నారు. ఆయన తన సినిమా హలోగురూ ప్రేమకోసమేకు ఇది అడ్డంపడుతుందని ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో యువి వంశీ కూడా అంత సముఖంగాలేరు. ఆయన తన టాక్సీవాలాను నవంబర్ 2న విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇలాంటి టైమ్ లో హీరో విజయ్ రంగంలోకి దిగిపోయారు. ట్విట్టర్ లో ఆయన ఓ పోల్ పెట్టారు. నోటా డేట్ చుట్టూ డ్రామా నడుస్తోందని, 5, 10,18 తేదీల్లో ఏది బెటర్ చెప్పండంటూ పోల్ పెట్టారు. అంతకు ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి నోటా విడుదల విషయమై కాస్త పెద్ద మీటింగ్ నే జరిగినట్లు, ఈ సమావేశంలో 18 కుదరదు అని.

ఇదంతా చూస్తుంటే దిల్ రాజు డేట్ కు అడ్డం పడుతున్నారని, జనాల చేత విజయ్ చెక్ చెప్పించాలని అనుకుంటున్నారా? లేక, తప్పని సరై అయిదున వస్తున్నామని చెప్పాలనుకుంటున్నారా? మొత్తంమీద నోటా సినిమా విషయంలో కాస్త గట్టి వ్యవహారమే నడుస్తోంది. కానీ తెలుగు సినిమా తీసిన తమిళ సినిమా నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా సరైన ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల, ఈ సమస్య అంతా వచ్చిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. 

చివరాఖరు ప్రయత్నంగా ఈ శనివారం ఓ మీటింగ్ ఏర్పాటుచేసారు. జ్ఞాన్ వేల్, దిల్ రాజు, ఏషియన్ సునీల్, యువి వంశీ తదితరులు ఈ సమావేశంలో పాల్గోని విడుదల డేట్ మీద ఆఖరికి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇదిలావుంటే అక్టోబర్ అయిదు అయితే బెటర్ అని 34శాతం మంది, అసలు ఈ నెలలోనే వద్దని 37శాతం మంది ట్విట్టర్ లో ఓటు వేయడం విశేషం. మరోపక్క ట్విట్టర్ కామెంట్ బాక్స్ లో ఎన్టీఆర్-విజయ్ అభిమానులు పోటా పోటీగా విమర్శలు చేసుకోవడం మరీ విశేషం.

ఇదిలా వుంటే అయిదో తేదీనే ఫిక్స్ చేసారని, శనివారం ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?