Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మాతలందు ఎన్నారై నిర్మాతలు వేరునా?

నిర్మాతలందు ఎన్నారై నిర్మాతలు వేరునా?

వెదుక్కోవాలే కానీ, మీరు.. మేము.. అని తేడాలు తీసుకురావడానికి టాలీవుడ్ లో ఓ ఎన్నారై నిర్మాత ఇదే పనికి శ్రీకారం చుట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఇండస్ట్రీలొ చాలా మంది ఎన్నారై నిర్మాతలు వున్నారు. కానీ పంపిణీ దారులు, ఎగ్జిబిటర్లు తక్కువ. అందువల్ల సినిమా ఎవరు తీసినా, ఎక్కడ తీసినా, కంట్రోలు అక్కడ వుంటోంది. అదే ఇబ్బందిగా వుందట ఈ ఎన్నారై నిర్మాతకు. అందుకే తోటి ఎన్నారై నిర్మాతలను ఎగసం దోసే పని పెట్టుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదేలా అంటే, ఎక్కవ సినిమాలు తీస్తున్నది ఎన్నారై నిర్మాతలు, హీరోలను, దర్శకులను ఎక్కువ ఎంగేజ్ చేస్తున్నది, ఇండస్ట్రీలో ఎక్కుడ డబ్బులు పంప్ చేస్తున్నది, ఫైనాన్షియర్లకు ఎక్కువ డబ్బులు ముట్టచెపుతున్నది ఎన్నారై నిర్మాతలే.

ఒక్క సినిమా తీసినా, ఎక్కువ సినిమాలు తీస్తున్నా చేస్తున్నది వారే. ఇలా అన్ని విధాలా ఇండస్ట్రీలో కీలకంగా వుంటూ, కీలకంగా నడిపిస్తూ, థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి చతికిలపడుతున్నాము, ఇక్కడ ఇండియన్ లోకల్స్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని థియేటర్లు చేతిలో వుంచుకోవడం ద్వారా కంట్రోలు చేస్తున్నారు. అన్నది ఆ ఎన్నారై థియరీ, వాదన, ప్రచారంగా వుందని ఇండస్ట్రీ టాప్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

అందువల్ల ఎన్నారై నిర్మాత ప్రతిపాదన ఏమిటంటే అందరూ కలిసి ఓ మాట మీదకు వచ్చి, ఓ సిండికేట్ గా ఏర్పడి ఎగ్జిబిషన్ సెక్టార్ లోకి, డిస్ట్రిబ్యూషన సెక్టార్ లోకి ప్రవేశించి, లోకల్ ప్లేయర్ల ఆట కట్టించాలని. సరే అంత వరకు బాగానే వుంది. కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ప్లే చేసేది సక్సెస్. దాని తరువాత ఇంకేదైనా.. గతంలో చాలా మంది ప్రయత్నించి, ఆ సక్సెస్ రాకనే ఫెయిలయ్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?