మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది వ్యూహం సినిమా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఇది. ప్రస్తుత అధికార పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అనుకూలంగా ఈ సినిమా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇలాంటి సినిమాను టీడీపీ, జనసేన జనాలు చూడరని, కేవలం వైసీపీ అభిమానులు మాత్రమే చూస్తారనే వాదన ఉంది. దీనిపై క్లారిటీ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
“నేను రోజూ పొద్దున్న లేచి పోర్న్ చూసినట్టు, టీడీపీ-జనసేన జనాలు వ్యూహం సినిమాను ఎవ్వరికీ తెలియకుండా వాళ్ల బాత్రూమ్స్ లో చూసుకుంటారనేది నా ఉద్దేశం. పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు ఆ అవసరం లేదు. హ్యాపీగా థియేటర్లకు వచ్చి చూడొచ్చు, లేదా తమ ఇంట్లో లివింగ్ రూమ్ లో అందరితో కలిసి చూడొచ్చు.”
గతంలో సికింద్రాబాద్ లో లాంబ అనే థియేటర్ ఉండేది. అందులో కేవలం సెక్స్ సినిమాలు మాత్రమే వేసేవారు. ఒకరికి తెలియకుండా మరొకరు అందులోకి వెళ్లి సినిమాలు చూసి వచ్చేవారని, వ్యూహం సినిమాను కూడా టీడీపీ-జనసేన జనాలు అలానే చూస్తారని అంటున్నాడు వర్మ.