కొన్ని రోజుల కిందటి సంగతి. హృతిక్ రోషన్ హీరోగా నటించిన పైటర్ సినిమా వివాదాస్పదమైంది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హృతిక్-దీపిక ఓ లిప్ కిస్ సీన్ చేశారు. అందులో తప్పులేదు కానీ వైమానిక దళం యూనిఫామ్ లో, రన్ వే పై ఆ సీన్ చేయడాన్ని ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ ఛాలెంజ్ చేశారు. దేశ ఔన్నత్యానికి, వైమానిక దళం ప్రతిష్టకు అది భంగం కలిగిస్తుందంటూ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారు.
అదింకా నలుగుతుండగానే సేమ్ కాన్సెప్ట్ తో ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా వస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా వైమానిక దళ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సినిమానే. మరి వివాదాల సంగతేంటి?
“సాయుధ బలగాలపై సినిమా తీస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్ గా ఉండాలి. చిన్న తప్పులు కూడా చేయకూడదు. నిజంగా ఓ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సినిమా చూసినప్పుడు కూడా తప్పు కనిపించకూడదు. అందుకే చాలా డీటెయిలింగ్స్ తీసుకున్నాం. ఏకంగా రక్షణ శాఖకు స్క్రిప్ట్ పంపించాం. వాళ్ల నుంచి కూడా సూచనలు తీసుకున్నాం.”
వైమానిక దళానికి చెందిన గొప్పదనాన్ని రియలిస్టిక్ గా చూపించాలనే ప్రయత్నం చేశామని వెల్లడించాడు వరుణ్ తేజ్. వరుసగా సాయుధ బలగాలపై సినిమాలు వస్తున్నాయనే కామెంట్ పై కూడా స్పందించాడు. వరుసగా ప్రేమకథలు వస్తున్నప్పుడు, సాయుధ బలగాలపై వరుసగా సినిమాలొస్తే తప్పేంటని అడుగుతున్నాడు.