Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రేకింగ్ - ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్?

బ్రేకింగ్ - ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ అభిమానులకు ఇది కాస్త చేదు వార్తే. వారి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎదురుచూస్తున్నవారికి ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే. 

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు బ్రేక్ పడినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. దాదాపు 99 శాతం ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారు తరువాత సినిమా మీదకు అన్నది అంత క్లారిటీ లేదు. కానీ ఇది కాదు కారణం. ఎన్టీఆర్ తో ఏ తరహా సినిమా చేయాలి?  అన్న దానిపై త్రివిక్రమ్ సరైన లైన్ ను క్లారిటీగా ఆలోచించలేకపోవడమే కారణం అని తెలుస్తోంది.

ముందుగా మంత్రిగారి వియ్యంకుడు లాంటి సినిమాను చేయలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ వద్దన్నారు. భారీ యాక్షన్ సినిమా చేయాలని మంచి లైన్ చెప్పారు. తనకు యాక్షన్ వద్దని, మాంచి ఫ్యామిలీ సినిమా కావాలని ఎన్టీఆర్ అడిగారు. 

దాంతో ఆ దిశగా డిస్కషన్లు జరిగాయి కానీ ఫలితం ఇవ్వలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత చేస్తున్న సినిమా కనుక సరైన కథ, స్క్రిప్ట్ తో వస్తేనే చేయగలనని ఎన్టీఆర్, తన మీద  ఆ మాత్రం నమ్మకం లేదా అని త్రివిక్రమ్. ఆఖరికి ఆర్ఆర్ఆర్ తరువాత మీరో సినిమా చేయండి. నేను ఓ సినిమా చేసుకుని వస్తాను అని ఎమికబుల్ సొల్యూషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల కథనం నిజమైతే ఈ ఉగాది కి మహేష్ - త్రివిక్రమ్ సినిమా ప్రకటన వస్తుందని బోగట్టా. ఎన్టీఆర్ సినిమా పెండింగ్ పడడం, మహేష్ సినిమా ప్రకటన రావడం అనే ఈ రెండు గ్యాసిప్ లపై క్లారిటీ రావాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?