ప్ర‌కాశ్‌రాజ్‌పై ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌పై వకీల్‌సాబ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ పంథాను గ‌ట్టిగా వ్య‌తిరేకించే ప్ర‌కాశ్‌రాజ్ అంటే మెగా అభిమానులు శ‌త్రువుగా భావిస్తారు. అలాంటి ప్ర‌కాశ్‌రాజ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి త‌న అభిమాను…

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌పై వకీల్‌సాబ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ పంథాను గ‌ట్టిగా వ్య‌తిరేకించే ప్ర‌కాశ్‌రాజ్ అంటే మెగా అభిమానులు శ‌త్రువుగా భావిస్తారు. అలాంటి ప్ర‌కాశ్‌రాజ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి త‌న అభిమాను ల‌ను ప‌వ‌న్ షాక్‌కు గురి చేశారు.

హైద‌రాబాద్‌లో వ‌కీల్‌సాబ్ ఫ్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్‌రాజ్ గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారంటే… ‘ ప్ర‌తివాద లాయ‌ర్‌గా ప్ర‌కాశ్‌రాజ్ న‌టించ‌డం ఈ సినిమాకు వ‌న్నె తెచ్చింది. ఒక బ‌ల‌మైన న‌టుడు ఉన్నాడంటే ఫ‌ర్మామెన్స్ బెట‌ర్ అవుతుంది. నా ఫ‌ర్మామెన్స్ బాగుండ‌డానికి ప్ర‌కాశ్‌రాజ్‌ను తీసుకొచ్చిన దిల్‌రాజ్‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా. అలాగే ప్ర‌కాశ్‌రాజ్‌, నేను పొలిటిక‌ల్‌గా విభిన్న‌దారుల్లో ఉండొచ్చు. కానీ సినిమా ప‌రంగా మేమంతా ఒక‌టే. 

ఆ మ‌ధ్య చాన‌ల్స్‌లో న‌న్నేమైనా మాట్లాడితే నాకేమీ ఇబ్బంది అనిపించ‌లేదు. అది ఆయ‌న అభిప్రాయం. గౌర‌విస్తాను. కానీ సినిమా ప‌రంగా ప్ర‌కాశ్‌రాజ్ నాకు ఇష్ట‌మైన న‌టుడు. ప్ర‌కాశ్‌రాజ్ గొప్ప న‌టుడు. నిజంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి అలాంటి గొప్ప న‌టుడు ఉండ‌డం మ‌న అదృష్టం. అలాంటి గొప్ప న‌టుడితో న‌టించే అవ‌కాశం సుస్వాగ‌తం, జ‌ల్సా , బ‌ద్రి సినిమాల త‌ర్వాత రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను’ అని ప్ర‌శంస‌లు కురిపించారు.

నిజానికి ఆ మ‌ధ్య బీజేపీతో మిత్ర‌త్వం సాగిస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప్ర‌కాశ్‌రాజ్ ట్విట‌ర్ వేదిక‌గా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. దానికి కౌంట‌ర్‌గా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా త‌న‌దైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. ఇలా ట్వీట్ తూటాలు పేల్చుకున్నారు. 

త‌నపై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ, అదంతా రాజ‌కీయ‌ప‌ర‌మైందే త‌ప్ప‌, వ్య‌క్తిగ‌తం కాద‌ని ప్ర‌క‌టించిన‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై గౌర‌వం పెంచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌వ‌న్‌లోని ఈ సుగుణాలే ఆయ‌నంటే అభిమానులు ప్రాణంగా ప్రేమించేలా చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి.