cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ చేతిలో మొబైల్ బ్రాండింగ్

ఎన్టీఆర్ చేతిలో మొబైల్ బ్రాండింగ్

హీరోలు అన్నాక బ్రాండ్ అంబాసిడర్లుగా వుండడం కామన్ నే. మహేష్, రామ్ చరణ్, బన్నీ తారక్ ఇలా అందరూ తలా బ్రాండ్ కి అంబాసిడర్లుగా వుంటారు. చైతన్య అఖిల్, నాగ్ కూడా చాలా బ్రాండ్ లకు పని చేస్తున్నారు. ఏడాదికి జస్ట్ ఒకటి రెండు కాల్ షీట్లు ఇస్తేచాలు, బ్రాండింగ్ ను బట్టి రెండుకోట్ల నుంచి పదికోట్ల వరకు వస్తాయి ఏడాదికి. అందుకే బ్రాండింగ్ మీద దృష్టి పెడుతుంటారు హీరోలు.

లేటెస్ట్ గా రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్ కు బ్రాండ్ అబాసిడర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఓ మొబైల్ స్టోర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా సైన్ చేసాడు. సెలెక్ట్ మొబైల్స్ అనే చైన్ స్టోర్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ కుదిరింది. ఏడాది పాటు ఎన్టీఆర్ ఈ సెలెక్ట్ మొబైల్ స్టోర్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు.

ఈ మధ్యనే ఈ సెలెక్ట్ స్టోర్స్ లను భరత్ అనే నేను హీరోయిన్ కైరాఅద్వానీ చాలాచోట్ల ఓపెన్ చేయడం విశేషం.