ఇజం అడియో ఫంక్షన్ వంక ఎన్టీఆర్ అభిమానులు ఆశగా చూస్తున్నారు. దీనికి కారణం ఆ సినిమా మీద ఆసక్తి కాదు. సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఫంక్షన్ లో ఎన్టీఆర్ తన తరువాతి సినిమా విశేషాలు వెల్లడిస్తాడేమో అని. కానీ అలాంటి పనేదీ ఈ ఫంక్షన్ లో జరిగే అవకాశాల ఫిఫ్టీ, ఫిఫ్టీ అని తెలుస్తోంది. పూరి కథ ను రెడీ చేసాడు కానీ, ఇంకా ఎన్టీఆర్ కు నెరేషన్ ఇవ్వలేదు. లైన్ మాత్రమే ఓకె అయింది.
ఇప్పటికీ ఇంకా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎమోషన్లతో కూడిన కథ ఎవరు తెస్తారా? అని ఆశగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇజం సినిమా ఫలితం చూసిన తరువాతే పూరికి అవకాశం ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా విడుదల జస్ట్ ఇంక మూడు వారాల దూరమే వుంది.
ఈ మాత్రం దానికి తొందరపడి మాట ఇవ్వడం ఎందుకు అన్నది ఎన్టీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అందువల్ల ఇజం అడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ తన కొత్త సినిమా గురించి కాజువల్ మచ్చట్లే తప్ప, పూర్తి డిటైల్స్ వెల్లడించే అవకాశాలు తక్కువే అంటున్నారు సినిమా జనాలు.