కొరటాల శివ గ్రామాల దత్తత కాన్సెప్ట్ ఓ రేంజ్ లో పండింది. ఆ తరువాతి సినిమాగా జనతా గ్యారేజ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ హీరోగా. అయితే మరి ఈ సినిమా సంగతేంటీ? ఈ సినిమాలో కూడా ఆ టైపు మెసేజ్ ఏమన్నా వుంటుందా? ఇలా ప్రశ్నిస్తే వుండే అవకాశం వుందనే సమాధానాలు వినవస్తున్నాయి ఇండస్ట్రీలో. ఈసారి పర్యావరణం మీద చిన్న అండర్ కరెంట్ మెసేజ్ లేదా అదే సెంటర్ పాయింట్ గా కథ రివాల్వ్ కావడం వుంటుందని తెలుస్తోంది.
జనతా గ్యారేజ్ కథ కాస్త కాన్ ఫ్లిక్ట్ గానే వుంటుందని వినికిడి. ఎన్టీఆర్, మోహన్ లాల్, సాయికుమార్, విలన్ ఉన్ని ముకుందన్ వీరందరి మధ్యా చుట్టరికాలు వుంటాయట. ఈ పాత్రలన్నింటి మధ్య వచ్చే కాన్ ఫ్లిక్ట్, అన్నింటికి మించి బలమైన ఫ్యాష్ బ్యాక్ కూడా వుంటాయట. కథ ముంబాయి నేపథ్యంలో చాలా వరకు జరుగుతుందట. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కొరటాల శివ జనతా గ్యారేజ్ కోసం కాస్త చక్కని,చిక్కని కథే అల్లినట్లు కనిపిస్తోంది. ఇది మరో నెల రోజుల్లో జనాల ముందుకు రాబోతోంది.