Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ ఫ్రీ..పూరి రెడీ

ఎన్టీఆర్ ఫ్రీ..పూరి రెడీ

విదేశానికి వెళ్లి, ఫుల్ స్క్రిప్ట్ చేసుకుని వచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. కానీ వెంటనే ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వినిపించడం కాలేదు. ఇజమ్ వ్యవహారాలు, అడియో ఫంక్షన్, ఈ సలహాలు సూచనల్లో బిజీగా వుండడమో, లేదా అడియో ఫంక్షన్ ముందు వింటే, ఎస్ ఆర్ నో ఎదో ఒకటి చెప్పి, ఫంక్షన్ లో ప్రకటన చేయాల్సి వస్తుందనో, మొత్తానికి ఎన్టీఆర్ స్క్రిప్ట్ వినలేదు. ఇప్పుడు ఫ్రీ అయ్యారట, అందువల్ల నేడో, రేపో పూరి స్క్రిప్ట్ వినడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. 

ఈ రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్ కథ వినేస్తాడని తెలుస్తోంది. ఆపై డెసిషన్ ఎప్పడు అన్నది చూడాలి. చేద్దాం అని చెప్పినా కూడా ఇప్పుడే ఏ ప్రకటన వుండకపోవచ్చు. ఇజమ్ విడుదల తరువాత వచ్చిన రెస్పాన్స్ మీదే ఇది ఆధారపడి వుంటుందని తెలుస్తోంది. ఇజమ్ సినిమా బాగానే వచ్చిందని, కచ్చితంగా మంచి సినిమా అనిపించుకుంటుందని పూరి నమ్మకంగా వున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే, ఇజమ్ సక్సెస్ వార్తతో ఎన్టీఆర్-పూరి సినిమా వార్త జత కలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?