Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ హగ్గులు అందుకేనా?

ఎన్టీఆర్ హగ్గులు అందుకేనా?

ఫ్యాన్స్ అంటే పిచ్చి అభిమానం కలవారు. వాళ్ల అభిమానానికి హద్దులు వుండవు. అలాంటి ఫ్యాన్స్ హద్దులు మీరినా, నటులు భరిస్తారు. భరించాల్సిందే. ఎందుకంటే హీరోల విజయకేతనాలు మోసేది ఫ్యాన్స్ నే కాబట్టి. అయితే ఒక్క నందమూరి బాలయ్య బాబు మాత్రం ఇక్కడ తేడా.

ఫ్యాన్స్ కాస్త హద్దు  మీరినా చెంప చెళ్లుమనిపోతుంది. టాప్ హీరో రేంజ్ కు ఫ్యాన్స్ ఇంక ఏం మాట్లాడతారు. అందుకే సైలెంట్ అయిపోతారు. పూరి లాంటి దర్శకులు డప్పేస్తారు. బాలయ్య బాబు కొట్టినా ముద్దే అంటూ.

ఇదిలా వుంటే, మొన్నటికి మొన్న జై లవకుశ సభ సందర్భంగా ఎన్టీఆర్ హగ్గులు, ముద్దులు వెనుక ఈ బాలయ్య బాబు దెబ్బల ప్రభావం వుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఈ జన్మకు ఫ్యాన్స్ తోనే వుంటా అని తండ్రి హరికృష్ణ తో చెప్పడం కూడా అందుకేనంటూ టాక్ వినిపిస్తోంది.

నందమూరి ఫ్యాన్స్ అంటూ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ వరకు హార్డ్ కోర్ జనాలు వున్నారు. వీరి సంఖ్య లక్షల్లోనో, వేలల్లోనో వుంటుంది. ఇప్పుడు వీరందరి మనసులు గెలవడమే ఎన్టీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

బాలయ్య కొడతాడు, ఎన్టీఆర్ కౌగిలించుకుంటాడు అన్నది అభిమానుల్లోకి వెళ్లేలా ఎన్టీఆర్ ఈ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?