Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్-కొరటాల శివ మళ్లీ చేస్తారా?

ఎన్టీఆర్-కొరటాల శివ మళ్లీ చేస్తారా?

మహేష్ తో రెండో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. అలాగే ప్రభాస్ తో మరో సినిమా చేస్తానని ఆయనే జనతా గ్యారేజ్ విడుదల సమయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. ముగ్గురు హీరోలతో ఇప్పటికి మూడు సినిమాలు చేసాడు. ఇద్దరితో రిపీట్ అన్నమాట. మరి వాట్ అబౌట్..ఎన్టీఆర్?

ఎన్టీఆర్ తో ఎప్పటికైనా మరో సినిమా చేసే చాన్స్ వుందా? అలా ప్రశ్నిస్తే వుండకపోవచ్చు అన్న సమాధానం వస్తోంది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల నుంచి. ఈ సినిమాను కొరటాల శివ ఎంతో వత్తిడి మేరకు చేసాడని జనతాగ్యారేజ్ విడుదలకు ముందే టాక్ వుంది. ఈ మధ్య ఓ ప్రయివేటు పార్టీలో కొరటాల శివ, ఆఫ్ ది రికార్డుగా కొందరు ఇండస్ట్రీ జనాలతో మాట్లాడుతూ, మళ్లీ చేయడం అన్నది కష్టమే అని కామెంట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బయటకి, ప్రెస్ మీట్లలో, మీడియా ముందు మాట్లాడే మాటల సంగతి కన్నా, ఇలాంటి పార్టీల్లోనే అసలు మనసులోని మాటలు బయటకు వస్తాయి. మరి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ మాటలే నిజమైతే, ఎన్టీఆర్ తో మళ్లీ ఇప్పట్లో కొరటాల శివ వుండదేమో? మామూలుగా చూసుకున్నా, మహేష్, ప్రభాస్ సినిమాలు పూర్తి కావాలి. బన్నీ లాగేయకుండా వుండాలి. అప్పుడు రిపీట్ అన్న ప్రశ్న.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?