ఎన్టీఆర్‌ కోసం ఇలాంటి పాటలా?

'అరవింద సమేత' ఆడియో రిలీజ్‌ అయింది. సిట్యువేషనల్‌ ప్రధానంగా వున్న పాటలకి సంగీత ప్రియుల నుంచి మంచి స్పందనే వస్తోంది కానీ ఎన్టీఆర్‌ వీరాభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మాస్‌ హీరో అయిన…

'అరవింద సమేత' ఆడియో రిలీజ్‌ అయింది. సిట్యువేషనల్‌ ప్రధానంగా వున్న పాటలకి సంగీత ప్రియుల నుంచి మంచి స్పందనే వస్తోంది కానీ ఎన్టీఆర్‌ వీరాభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మాస్‌ హీరో అయిన ఎన్టీఆర్‌ సినిమాలకి కేవలం పాటలు, డాన్సుల కోసమే వచ్చే ప్రేక్షకులు ఎంతోమంది వుంటారు. మొత్తం నాలుగు పాటల్లో ఒక్కటి మాత్రమే మాస్‌ కోసం చేసిన పాట కాగా మిగతావన్నీ ఎన్టీఆర్‌ పాటల్లా లేవు.

'అజ్ఞాతవాసి' చిత్రం కంటెంట్‌ విషయంలో త్రివిక్రమ్‌ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. స్టార్‌ రైటర్‌ అయి వుండి అలాంటి సినిమా ఎలా తీస్తాడనే విమర్శల నేపథ్యంలో ఈసారి త్రివిక్రమ్‌ కామెడీ కూడా పక్కన పెట్టి సీరియస్‌ టోన్‌లో ఈ సినిమా తీసినట్టున్నాడు. ఆడియోలో మరో మాస్‌ పాట వున్నా ఫాన్స్‌ సంబరపడిపోయేవారే. అందులోను నాలుగు పాటల్లో రెండే అచ్చమైన పాటలు కాగా, మిగతా రెండూ బ్యాక్‌గ్రౌండ్‌ పాటల్లానే వున్నాయి.

ఎంత వైవిధ్యం చూపించినా రంగస్థలం, భరత్‌ అనే నేను చిత్రాలకి కమర్షియల్‌ అంశాల విషయంలో దర్శకులు రాజీ పడలేదు. కథాపరమైన విలువలు పాటించే జాగ్రత్తలో త్రివిక్రమ్‌ కమర్షియల్‌ సూత్రాలు మిస్‌ అయ్యాడేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.