ఎన్టీఆర్ కు ఆ ఆపరేషన్?

ఎన్టీఆర్ కు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగింది. అయిదు కిలోల ఫ్యాట్ ను తొలగించారు. ఇదీ ట్విట్టర్ లో కనిపిస్తున్న వార్త. ఎంత వరకు నిజం అన్నది తెలియదు. నిజం కాదని ఎన్టీఆర్ యూనిట్ వర్గాలు…

ఎన్టీఆర్ కు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగింది. అయిదు కిలోల ఫ్యాట్ ను తొలగించారు. ఇదీ ట్విట్టర్ లో కనిపిస్తున్న వార్త. ఎంత వరకు నిజం అన్నది తెలియదు. నిజం కాదని ఎన్టీఆర్ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. యమదొంగ సినిమా టైమ్ నుంచి ఎన్టీఆర్ ఫిట్ నెస్ బాడీతో కనిపిస్తూ వస్తున్నారు. టెంపర్ సినిమాలో అయితే సిక్స్ ప్యాక్ తో కనిపించారు కూడా.

అయితే జై లవకుశ సినిమా కోసం మూడు పాత్రలు పోషించాల్సి రావడం, దాంట్లో రావణ పాత్ర కోసం వైవిధ్యం చూపించాల్సి రావడంతో ఎన్టీఆర్ ఫిజిక్ కొంచెం మారింది. అందువల్లను, రాబోయే త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ను ట్రయ్ చేయాలని అనుకోవడంతో, మళ్లీ మాంచి ఫిట్ నెస్ తో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని వార్తలు వినవచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ బయట కనిపించలేదు. నార్త్ లో ఆయన ఫ్రెండ్స్ ఫంక్షన్ కు వెళ్లారని యూనిట్ అంటోంది. మరి ఇవన్నీ కలిసి ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ పుట్టించారో, ఇంకేమైనా వుందో కానీ, ఎన్టీఆర్ కు లైపోసక్షన్ ఆపరేషన్ జరిగిందని, అయిదు కిలోల ఫ్యాట్ తగ్గించారని ట్విట్టర్ లో ఒకటి రెండు ట్వీట్ లు కనిపించాయి. కానీ ఎన్టీఆర్ యూనిట్ వర్గాలు ఇవన్నీ కిట్టని వారి పని అని కొట్టి పారేసాయి.