గోవిందుడు ఇచ్చిన ఉత్సాహం దర్శకుడు కృష్ణవంశీని మరోసారి ఎన్టీఆర్ ఇంటి దిశగా నడిపించింది. ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఓ కథను తీసుకెళ్లి, అతగాడికి వినిపించేసాడు. ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్, ఓకె అలాగే చేద్దాం అనేసాడు. ఇదీ టాలీవుడ్ లేటెస్ట్ డిస్కషన్ పాయింట్.
హిట్ కొట్టిన డైరక్టర్లపై రుమాళ్లు వేయడం అన్నది ఎన్టీఆర్ స్టయిల్. కానీ అవన్నీ అతగాడిని దారుణంగా దెబ్బతీసాయి..ఇటీవలి రభసతో సహా. పైగా కృష్ణవంశీతో చేసిన రాఖీ ఓ ఎక్స్ పీరియన్స్ వుండనే వుంది. మరి ఇన్నీ తెలిసి మళ్లీ ఎన్టీఆర్ ఓకె అన్నాడంటే, కృష్ణవంశీ చెప్పిన లైన్ అంత ఇంప్రెస్ చేసి వుండాలి. లేదా చూద్దాం..లెండి..అనేనా అని వుండాలి.
అయినా మెగా క్యాంప్ లో అంటే సవాలక్ష జాగ్రత్తలు, బోలెడు గొళ్లాలు వుంటాయి. అందువల్ల గోవిందుడు మార్జిన్ లో గట్టెక్కింది. ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర అలాంటి వ్యవహారాలు ఏమీ వుండవు. ఆయనదే సోలో కెలుకుడు. అందువల్ల ఈ సినిమా సంగతి ఇప్పుడప్పుడే తెలిసేది కాదు. వెయిట్ చేయాల్సిందే.