వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రకటించడం మెగా ఫాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. నాగబాబు తనయుడి తొలి చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ సినిమా ఉందని తెలిసీ సంక్రాంతి బరిలో నిలుపుతున్నామని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
పవన్‌కళ్యాణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ ‘ముకుంద’ రిలీజ్‌కి అదే డేట్‌ని ఎంచుకోవడం ఫిలిం బఫ్స్ అటెన్షన్ రాబట్టుకుంది. పవన్‌కళ్యాణ్‌తో ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సత్సంబంధాలు లేవనేది జగద్విదితం.
చూస్తుంటే కావాలనే ‘ముకుంద’ చిత్రాన్ని ‘గోపాల గోపాల’కి పోటీగా విడుదల చేస్తున్నట్టు అనిపిస్తోందని గాసిప్ సర్కిల్స్ నొక్కి చెబుతున్నాయి. రెండూ క్లాస్ సినిమాలే కావడం… అందులోను పవన్‌కళ్యాణ్ అందులో స్పెషల్ రోల్ చేయడం.. ‘ముకుంద’కి అడ్వాంటేజ్ అయి.. ‘గోపాల’కి డ్యామేజ్ చేస్తుందని మెగా క్యాంప్ ఆలోచిస్తోందని పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే ఒక కొత్త హీరో సినిమా వచ్చి పవన్‌కళ్యాణ్ నటించిన సినిమాకి పోటీ అవుతుందా, పవర్‌స్టార్ పవర్‌ని ముకుంద టీమ్ అంత తక్కువ అంచనా వేస్తుందా అనేది డిబేటబుల్.