రిలీజ్‌ అవకుండానే పెద్ద హిట్‌

ఏమీ జాక్సన్‌ ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించేసింది. ఎవడుతో హిట్‌ సాధించిన ఏమీకి ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. విదేశాల్లో పుట్టి పెరిగినా కానీ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో…

ఏమీ జాక్సన్‌ ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించేసింది. ఎవడుతో హిట్‌ సాధించిన ఏమీకి ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. విదేశాల్లో పుట్టి పెరిగినా కానీ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిజీగా ఉంటోన్న ఈ సూపర్‌ మోడల్‌ అదృష్టం కొద్దీ శంకర్‌ ‘ఐ’లో ఛాన్స్‌ కొట్టేసింది. 

బాలీవుడ్‌కి చెందిన స్టార్‌ హీరోయిన్ల పేర్లు పరిశీలించిన శంకర్‌ చివరకు ఏమీకి అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం రిలీజ్‌ అయిన తర్వాత ఏమీ సౌత్‌ ఇండియాలోనే కాకుండా నేషనల్‌ రేంజ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందని అంచనాలున్నాయి. రిలీజ్‌ అయ్యే వరకు వేచి చూడాల్సిన పని లేకుండానే ఏమీ సూపర్‌హిట్‌ అయి కూర్చుంది. 

విక్రమ్‌తో నటించిన ఏమీకి తన మలి చిత్రంలో సూర్యతో రొమాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. అలాగే తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ తదుపరి చిత్రంలో కూడా ఏమీ నటించే అవకాశముందని తెలిసింది. 

ఇంకా విడుదల కాకుండానే డిమాండ్‌ ఇలాగుందంటే ‘ఐ’ రిలీజ్‌ అయి నిజంగానే అంచనాలని అందుకున్నట్టయితే ఇక ఏమీ జాక్సన్‌ సూపర్‌స్టార్‌ అయి కూర్చుంటుంది.