రాణా, త్రిష మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని మీడియా కోడై కూస్తోంది. తమ మధ్య ఏదో ఉందని ఎవరు ఎన్నిసార్లు రాసినా కానీ దానిని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు ఇద్దరూ. పైగా ఆ పుకార్లకి మరింత ఊతమిచ్చేలా రాసుకు పూసుకు తిరిగారు.
ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేటట్టుగా మాట్లాడుతూ.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే భావన కలిగించారు. ఇక పెళ్లి చేసుకోవడమే మిగిలిందని, త్వరలోనే ఆ వార్త కూడా వినబోతున్నామని కూడా పత్రికల్లో రాసేసారు.
అయితే సడన్‌గా త్రిషకి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిందనే వదంతులు పుట్టుకొచ్చాయి. సినీ నిర్మాత, పారిశ్రామిక వేత్త వరుణ్ మనియన్తో త్రిష నిశ్చితార్థం గప్‌చుప్‌గా జరిగిందని పత్రికల్లో వచ్చింది. కానీ త్రిష ఆ పుకార్లని కొట్టి పారేసింది. షూటింగ్‌తో బిజీగా ఉన్నానని చెప్పింది.
మరి వరుణ్‌తో రిలేషన్ సంగతేంటి అంటే నవ్వుతూ దాటేసింది. ఇద్దరి మధ్య అనుబంధం అయితే ఉందనేది లేటెస్ట్ గాసిప్. మరి రాణాతో త్రిషకి అఫైర్ లేనట్టేనా. ఇంతటితో వారిద్దరి గురించిన గాసిప్స్‌కి తెర వేసేయవచ్చా?