దాసరికి పెద్ద దెబ్బే!

ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథాబలమున్న చిత్రాన్ని తీసానని, ‘ఎర్రబస్సు’ చిత్రంతో తిరిగి తనకు భారీ విజయం దక్కుతుందని దాసరి నారాయణరావు చెబుతూ వచ్చారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్ట్రస్‌ షో…

ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథాబలమున్న చిత్రాన్ని తీసానని, ‘ఎర్రబస్సు’ చిత్రంతో తిరిగి తనకు భారీ విజయం దక్కుతుందని దాసరి నారాయణరావు చెబుతూ వచ్చారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్ట్రస్‌ షో ఇస్తోంది. మొదటి రోజే ఈ చిత్రానికి కలెక్షన్స్‌ లేకుండా పోయాయి. 

చెప్పుకోతగ్గ ఆర్టిస్టులు నటించి, ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ అయిన చిత్రాల్లో ‘ఎర్రబస్సు’ అత్యంత వీక్‌గా పర్‌ఫార్మ్‌ చేసింది. ఫస్ట్‌ వీకెండ్‌లో చాలా దారుణమైన కలెక్షన్స్‌ రావడం చూస్తే ఈ చిత్రంపై ప్రేక్షకులు కనీస ఆసక్తి చూపించలేదని అర్థమవుతోంది. 

దాసరి నారాయణరావుకి గత పదిహేనేళ్లలో చెప్పుకోతగ్గ విజయం లేకపోవడం.. ఆయన తీసిన గత చిత్రాలు పరమవీరచక్ర, యంగ్‌ ఇండియా కూడా బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా ఇదే విధంగా తిరస్కరణకి గురయ్యాయి. 

ఎర్రబస్సుతో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకుందామని అనుకున్న దాసరి ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ఆయనకి దీని రూపంలో భారీ నష్టం తప్పేట్టు లేదని ట్రేడ్‌ టాక్‌.