Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అక్షయ్ పాత్రలో రవితేజ?

అక్షయ్ పాత్రలో రవితేజ?

ఏడాది క్రితం బాలీవుడ్ లో వచ్చిన హిట్ సినిమాల్లో స్పెషల్ 26 ఒకటి. అక్షయ్ ఈ సినిమాలో నకిలీ సిబిఐ అధికారి పాత్రలో నటించాడు. అనుపమ ఖేర్ ది కూడా ఓ కీలకపాత్ర. ఈ సినిమాకు రెండు తెలుగు లింక్ లు వున్నాయి. ఒకటి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించడం. రెండు కీరవాణి సంగీతం అందించడం. 

ఓ తెలుగు మాస్ మసాలా సినిమాకు, అందునా రవితేజ టైపు వినోదానికి కావాల్సిన్నని అన్ని హంగులు వున్నాయి ఈ కథకు. అయితే దీని తెలుగు, తమిళ, కన్నడ హక్కులను తమిళ నిర్మాత త్యాగరాజన్ ఎప్పుడో తీసుకున్నారు. వైకామ్ 18 నుంచి త్యాగరాజన్ ఈ హక్కులు కొనుగోలు చేసారు. 

తన కుమారుడు, చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో ప్రశాంత్-ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో ఈ సినిమా చేయాలని ఆయన ఆలోచన. ఈ సినిమా కోసం కొంతమంది తెలుగు నటులను కూడా తీసుకున్నారు. డబ్బింగ్ కు పనికివస్తుందని. వారిలో బ్రహ్మాజీ, రావు రమేష్ కూడా వున్నారు. 

అయితే ఇలా కాకుండా ఉభయ భాషల్లో తీస్తే ఎలా వుంటుదని ఇప్పుడు త్యాగరాజన్ ఆలోచిస్తున్నారని వినికిడి. అందుకోసం ఆయన రవితేజతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

అన్నీ ఓకె అయితే అక్కడ ప్రశాంత్, ఇక్కడ రవితేజ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మిగిలన స్టార్ కాస్ట్ అలాగే వుంటుంది. చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు మెటిరియలైజ్ అవుతుందో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?