పోకిరి రిటర్న్స్ అనే సూపర్ టైటిల్ ఇటీవల రిజిస్టరై, బోలెడు ఊహాగానాలకు తావిచ్చింది. ఇలాంటి టైటిల్ రిజిస్టర్ చేయాలని దర్శకుడు పూరి జగన్నాధ్ అనుకున్నారని, ఇంతలో ఎవరో రిజిస్టర్ చేసారని, దీంతో పూరి చాలా డిస్సపాయింట్ అయ్యారని కూడా వార్తలు వినవచ్చాయి.
అయితే ఈ టైటిల్ ను వర్మే తెరవెనుక వుండి రిజిస్టర్ చేయించారని, సంపూర్ణేష్ బాబుతో ఓ స్పూఫ్ సినిమా తీయాలన్న ఆలోచనతో ఇలా చేసారని తెలుస్తోంది. వర్మ కామెడీ సినిమాలు తీయలేడని కాదు.
అసలు వర్మ క్షణక్షణం సినిమాలో టచ్ చేసిన కామెడీ భలేగా వుంటుంది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుతో కామెడీ టచ్ తో స్ఫూఫ్ తీస్తాడన్నది నిజమైతే, అది ఓ రేంజ్ లో క్రేజ్ ను సంతరించుకుంటుంది.
అయితే ఇటీవల ఇలా చిన్నా చితకా సినిమాలు తీస్తూ, వర్మ తన మార్కెట్ ను తానే డౌన్ చేసుకుంటున్నాడు. వర్మ సంగతి ఎలా వున్నా, హృదయ కాలేయం మాదిరిగా అమెచ్యూర్ స్పూఫ్ లా కాకుండా, కాస్త వెల్ వెర్సెడ్ స్పూఫ్ చేస్తే, సంపూ బాబు పంట పండే అవకాశం వుంది.