ఎన్టీఆర్ కు మళ్లీ అదే సమస్య?

అడియో ఫంక్షన్ లు అంటే అభిమానులే ప్లస్సూ, మైనస్సూగా మారుతున్నారు. గతంలో ఈ తరహా సమస్య ఒక్క మెగా ఫంక్షన్ లకే వుండేది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫంక్షన్ లకు కూడా సోకుతోంది. ఇంతకీ సమస్య…

అడియో ఫంక్షన్ లు అంటే అభిమానులే ప్లస్సూ, మైనస్సూగా మారుతున్నారు. గతంలో ఈ తరహా సమస్య ఒక్క మెగా ఫంక్షన్ లకే వుండేది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫంక్షన్ లకు కూడా సోకుతోంది. ఇంతకీ సమస్య ఏమిటంటే..జిందాబాద్ లు కొట్టడం. అభిమానులు జిందాబాద్ అంటే ఆనందమేగా..అనుకోవద్దు. ఒకళ్ల సమావేశానికి వచ్చి మరొకరికి జేజేలు కొడితే ఎలా వుంటుంది? ఎక్కడో మండిపోతుంది. కానీ తప్పదు పైకి నవ్వాల్సిందే. 

మెగా ఫంక్షన్ లలో తరచు వినిపించే మాట పవర్ స్టార్..ఇలాంటి పవర్ స్లోగన్ లకు విసిగి, నాగబాబు బరస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫంక్షన్ లలో జై బాలయ్య స్లోగన్ లు వినిపించడం ఇటీవల ప్రారంభమయింది. ఇప్పుడు మరో ఫంక్షన్ కు టైమ్ అయింది. నాన్నకు ప్రేమతో అడియో రేపు (ఆదివారం) శిల్పకళా వేదిక పై జరగబోతోంది. 

మళ్లీ ఈ సమావేశంలో కూడా జై బాలయ్య స్లోగన్  లు వినిపించే అవకాశం వుందని వినికిడి. అప్పటికి ఫ్యాన్స్ కు పాస్ లు ఇచ్చేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పక్కా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రమే ఇస్తున్నారట. అయినా ఎలాగోలా వచ్చి, జై బాలయ్య అంటే ఏం చేయాలి..వేదికపై వున్న ఎన్టీఆర్ కూడా చిరునవ్వులు చిందించి, మంచి వాడులే మా బాబాయి..అంటూ పాడడం తప్ప..ఇంకేం వుంటుంది?