Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి..చార్మి..ఓ వాస్తవం?

పూరి..చార్మి..ఓ వాస్తవం?

సినిమా నటులకే కాదు..దర్శకులకు కూడా నటన బాగా వస్తుంది. చాలా మంది స్క్రీన్ మీద, మరి కొందరు ఆఫ్ ది స్క్రీన్ భలేగా నటించేస్తుంటారు. దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా ఇప్పుడు అలాంటి నటనే ప్రదర్శిస్తున్నది టాలీవుడ్ ఇన్ సైడ్ సమాచారం. పూరి..చార్మి సన్నిహితులని, ఆమె ఆయన ఆఫీసు వ్యవహారాలు చూస్తారని, పైగా ప్రొడక్షన్ పనులు కూడా చూస్తారని చాలా కాలంగా వార్తలు వినవస్తున్నాయి. వాటిని వాళ్లు ఖండించేలేదు కూడా. 

అయితే చార్మి కారణంగా పూరికి చాలా మంది దూరం అవుతున్నారని, టాక్ వుంది. లోఫర్ విడుదల అనంతరం కొత్త వార్త బయటకు వచ్చింది. చార్మీని పూరి తన ఆఫీసు నుంచి బయటకు పంపేసారని, ఇప్పుడు వారిద్దరి స్నేహం కట్ అని. చాలా మంది ఆశ్చర్యపోయారు. నిజమా అని కూడా అనుకున్నారు. నిజమే అని కూడా వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఊ..ఉత్తుత్తినే..అన్నది. చార్మి ఇప్పుడు పూరి ఆఫీసుకు రావడం మానేసిన మాట నిజమే. 

కానీ ఆమెతో పూరి స్నేహం, సాన్నిహిత్యం అలాగే వున్నాయని టాక్ వినిపిస్తోంది. నిన్నటికి నిన్న ఓ టెక్నీషియన్ పూరిని కలవడానికి ఆఫీసుకు వెళ్లారట. కాస్సేపటికే ఓ ఎంప్లాయి వచ్చి, ఏం పనిమీదవచ్చారని, మేడమ్ అడగమన్నారు అందట. ఏ మేడమ్ అని అడిగితే, చార్మి మేడమ్ అని రిప్లయ్ వచ్చిందట. దాంతో ఆ టెక్నీషియన్ కు కళ్ల ముందు చార్మీని వదిలేసిన పూరి అంటూ వచ్చిన వార్తలన్నీ గిర్రున తిరిగి బిత్తరపోయాడట. 

అలా ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో..ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ఫీల్డ్ లో మంచి మార్కులు కోట్టేయడానికి తయారు చేసిన ఎపిసోడ్ అనుకుంటారు అంతా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?