ఎన్టీఆర్ కు మెకానిక్ అచ్చి వస్తుందా?

మన హీరోలకు అచ్చిరాని సెంటిమెంట్ పాత్రలు కొన్ని వుంటాయి. వాటిల్లో మెకానిక్ ఒకటి. మన హీరోలు చాలా మంది సినిమాల్లో మెకానిక్ పాత్రలు ధరించారు. కానీ ఆ సినిమాలేవీ అంతగా ఆఢలేదు. Advertisement చిరంజీవి,…

మన హీరోలకు అచ్చిరాని సెంటిమెంట్ పాత్రలు కొన్ని వుంటాయి. వాటిల్లో మెకానిక్ ఒకటి. మన హీరోలు చాలా మంది సినిమాల్లో మెకానిక్ పాత్రలు ధరించారు. కానీ ఆ సినిమాలేవీ అంతగా ఆఢలేదు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజశేఖర్, నాగార్జున ఇలా పలువురు మెకానిక్ పాత్రలు పోషించారు కానీ, ఫలితం..పిటీ. ఎన్టీఆర్ కూడా గతంలో అశోక్ సినిమాలో మెకానిక్ గా నటించాడు. ఫలితం తెలిసిందే.

ఇప్పుడు ఇంతకీ సంగతి ఏమిటంటే, కొరటాల శివ-మైత్రీ మూవీస్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ మెకానిక్ అని టాక్. సినిమాకు జనతా గ్యారేజ్ అన్నది టెంటటివ్ టైటిల్ అని వినిపిస్తోంది. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రాను సంప్రదిస్తున్నారని మరో టాక్. మొహన్ లాల్ స్పెషల్ రోల్ ధరించే అవకాశం వుంది.