టాలీవుడ్ రీసెంట్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు టాప్ హీరోలు ఒక ఫంక్షన్ ను పంచుకోవడం అన్నది భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ లో జరిగింది. ఇది ఓ కొత్త, మంచి పరిణామం, అని అందరూ భావించారు. కానీ తీరా ఆడియో ఫంక్షన్ చూసిన తరువాత ఇద్దరు హీరోలు ఒక దగ్గర చేరి చేసిందేమిటి? దాని వల్ల వచ్చిన లాభమేమిటి? అనిపించింది ప్రతి ఒక్కరికి.
ఎందుకంటే సినిమా ఫంక్షన్ కు వచ్చి, మహేష్ ను హగ్ చేసుకుని, పక్కన కూర్చున్న లగాయతు ఎన్టీఆర్ పూర్తిగా ముభావంగా, సీరియస్ గా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చికాగ్గా మొహం పెట్టుకుని కూర్చున్నాడు తప్ప, పోరపాటున ఓ మాట లేదు, నవ్వులేదు.
స్టేజ్ మీదకు వచ్చిన తరువాత కూడా మహేష్ కు కాస్త దూరంగానే వున్నారు ఎన్టీఆర్. తరువాత దగ్గరకు రమ్మని, ఫొటోకు ఫోజ్ ఇవ్వాలని కోరితే, కాస్త దగ్గరగా వచ్చి, ఓ నవ్వు నవ్వారు. అదే మొత్తం తారక్ అటెండెన్స్ కు హైలైట్ అనుకోవాలి. ఆ తరువాత మళ్లీ ఎడంగానే, సీరియస్ గానే.
మరోపక్క మహేష్ బాబు కూడా సీరియస్ గానే వున్నారు. ఆయన తరపున కూడా పలకరించాలనే ఆలోచన వున్నట్లు కనిపించలేదు. ఓ నవ్వులేదు. ఈమాత్రం దానికి ఇద్దరు ఓ దగ్గరకు రావడం దేనికో? దీని ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో, అభిమానులకు.