బన్నీ కోసం సైకత శిల్పం

ఫ్యాన్స్ అభిమానం ఓ రేంజ్ లో వుంటుంది తమ హీరో అంటే. పాలాభిషేకాలు, పూలదండలు ఓల్డ్ స్టయిల్. ఇప్పుడు సినిమాల మాదిరిగానే అభిమానం చాటడానికి కూడా వైవిధ్యమైన మార్గాలు వెదుక్కుంటున్నారు. విశాఖ బన్నీ ఫ్యాన్స్…

ఫ్యాన్స్ అభిమానం ఓ రేంజ్ లో వుంటుంది తమ హీరో అంటే. పాలాభిషేకాలు, పూలదండలు ఓల్డ్ స్టయిల్. ఇప్పుడు సినిమాల మాదిరిగానే అభిమానం చాటడానికి కూడా వైవిధ్యమైన మార్గాలు వెదుక్కుంటున్నారు. విశాఖ బన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా రెండు లక్షలకు పైగా ఖర్చుచేసి ఓ, సైకతశిల్పాన్ని నిర్మింపచేసారు.

ఇందుకోసం నిపుణుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన కళాకారుడిని ఎంగేజ్ చేయడంతో, దానికే లక్షన్నర వరకు అయినట్లు తెలుస్తోంది. ఆపైన కూలీలకు ఇతరత్రా వ్యవహారాలకు మరో యాభై వేలకు పైనే ఖర్చయినట్లు తెలుస్తోంది.

బన్నీ పుట్టిన రోజు సందర్భంగా నాపేరు సూర్య విడుదలను దృష్టిలో వుంచుకుని, ఇటు ఆ సినిమా లోగో, ట్యాగ్ లైన్, బన్నీ ఫేస్, మరో పక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు కలిపి సైకత శిల్పంగా తయారుచేసారు. పూరికి చెందిన సైకత శిల్ప కళాకారుడు మానస్ సాహు ఈ శిల్పాన్ని రూపొందించారు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి