కరోనా తగ్గుతున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తన రెగ్యులర్ వర్క్ లోకి వచ్చేసారు. ఆర్ఆర్ఆర్ ఓ చిన్న షెడ్యూలు ఫినిష్ చేసి గెటప్ ట్రయిల్స్ లోకి వచ్చారు.
దేనీకీ గెటప్ అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం. పలు రకాల డ్రెస్ లు మార్చి, లైట్ గా గెటప్ మార్చి ఓ రోజంతా ఫొటో సెషన్ చేసారు. అయితే ఇంకా ఏ గెటప్ ఫైనల్ కాలేదని, మరో రోజు ఈ ట్రయిల్స్ కొనసాగుతాయని బోగట్టా.
మీలో ఎవరు కోటీశ్వరుడు ఇప్పటికే షూట్ ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా రెండో దశ కారణంగా ఆగిపోయింది. జూలై నెలాఖరులు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ నుంచి ఫ్రీ అయిపోతారు.
అప్పటి నుంచి ఎమ్ ఇ కే ఎపిసోడ్ ల షూట్ ప్రారంభమయ్యే అవకాశం వుంది. అలాగే కొరటాల శివ సినిమా కూడా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
గతంలో నాగ్, చిరు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో కాస్త టైటిల్ మార్చుకుని, ఛానెల్ మారి జెమినిలో ప్రసారం కాబోతోన్న సంగతి తెలిసిందే.