Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్‌తో కళ్యాణ్‌రామ్‌.. 'బ్రదర్స్‌'.?

ఎన్టీఆర్‌తో కళ్యాణ్‌రామ్‌.. 'బ్రదర్స్‌'.?

కళ్యాణ్‌రామ్‌ తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్స్‌ పతాకంపై కొత్త సినిమా టైటిల్‌ని ఒకదాన్ని రిజిస్టర్‌ చేయించాడు. ఛాంబర్‌లో రిజిస్టర్‌ అయిన ఆ సినిమా టైటిల్‌ 'బాక్సర్‌'. అసలు ఈ టైటిల్‌ని కళ్యాణ్‌రామ్‌ ఎందుకు రిజిస్టర్‌ చేశాడు.? దర్శకుడెవరు.? ఇలా రకరకాల ఊహాగానాలిప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

తన తమ్ముడు ఎన్టీఆర్‌తో కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'బాక్సర్‌' సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తడనే ప్రచారం అందులో ఒకటి. అదంతా ఉత్తదే, కళ్యాణ్‌రామ్‌ హీరోగా 'బాక్సర్‌' సినిమా తెరకెక్కనుందనీ, ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తాడనే మరో ప్రచారమూ జరుగుతోంది. 

వీటికి తోడు మరో హాటెస్ట్‌ గాసిప్‌ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి లీకవుతోంది. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌, సిద్దార్ధ మల్హోత్రా కలిసి నటించిన 'బ్రదర్స్‌' సినిమా తరహాలో ఈ 'బాక్సర్‌' వుంటుందనీ, ఇందులో కళ్యాణ్‌రామ్‌తోపాటు ఎన్టీఆర్‌ కూడా నటిస్తాడనీ ఆ 'లీకు' సారాంశం. అయితే, 'బ్రదర్స్‌' బాలీవుడ్‌లో ఏమంత గొప్ప విజయాన్ని సాధించలేదు. ఆ విషయాన్ని స్వయంగా అక్షయ్‌కుమార్‌ అంగీకరించేశాడు. అయితే, ఆ సినిమా కోసం అక్షయ్‌కుమార్‌ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. 

అయితే, ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని కళ్యాణ్‌రామ్‌ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. టైటిల్‌ చూస్తోంటే 'బాక్సర్‌'. 'బ్రదర్స్‌' కూడా కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలోని కథే. సో, అదీ ఇదీ మ్యాచ్‌ చేసి 'బాక్సర్‌' సినిమా 'బ్రదర్స్‌'కి ఫ్రీమేకో ఇన్‌స్పిరేషనో అవుతుందని టాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. 'ఇజం' సినిమాకి ముందు కళ్యాణ్‌రామ్‌ వ్యూహాత్మకంగా 'బాక్సర్‌' టైటిల్‌నిగానీ పబ్లిసిటీ కోసం రిలీజ్‌ చెయ్యలేదు కదా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?